యూజీసీ నెట్-2024 జూన్ అడ్మిట్‌కార్డులు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
యూజీసీ నెట్ 2024 హాల్‌టిక్కెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు అప్లయ్ చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోగలరు. యూజీసీ నెట్ 2024 జూన్ సెషన్‌కు సంబంధించిన అడ్మిట్‌కార్డులు తాజాగా విడుదలయ్యాయి. అడ్మిట్‌కార్డులను ఎన్‌టిఎ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోగలరు.
యూజీసీ నెట్-2024 జూన్ సెషన్‌కు సంబంధించి గతనెలలో నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక, ఇప్పడు తాజాగా వీటికి సంబంధించి హాల్‌టిక్కెట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టిక్కెట్లను అందుబాటులో ఉంచింది. యూజీసీ నెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఈ నెల జూన్ 18న యూజీసీ నెట్ పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష ఓఎమ్ఆర్ విధానంలో ఉంటుంది. మొత్తం 83 సబ్జెక్టులకుగాను యూజీసీ నెట్ పరీక్ష 2024 నిర్వహించనున్నారు.

పేపర్ విధానం..
ఇందులో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఇస్తారు.
పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది. పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. ఎటువంటి నెగటివ్ మార్కులు ఉండవు. పేపర్ 1లో రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్‌జెంట్ థింకింగ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి మాత్రమే ప్రశ్నలు ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో మాత్రమే ప్రశ్నాపత్రం ఉంటుంది.
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ విధానం..
యూజీసీ నెట్ 2024 జూన్ సెషన్‌కు సంబంధించిన అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి -ugcnet.nta.nic.in. వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ హోంపేజీలో కనిపించే 'UGC NET June 2024 Click Here to Download Admit Card' లింక్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అందులో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే కంప్యూటర్ స్క్రీన్ మీద అడ్మిట్ కార్డు కనిపిస్తుంది.
వెంటనే అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకొని, భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసిపెట్టుకోవాలి.












Click it and Unblock the Notifications