UGC NET Results : యూజీసీ నెట్ ఫలితాల విడుదల-స్కోర్ కార్డు ఇలా చెక్ చేసుకోండి..

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దేశవ్యాప్తంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్ మెంట్ తో పాటు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం నిర్వహించిన నెట్ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. డిసెంబర్ 2023 సెషన్ లో భాగంగా నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ఇవాళ జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. యూజీసీ అధికారిక వెబ్ సైట్ లో ఈ ఫలితాలను అందుబాటులో ఉంచింది.

యూజీసీ నెట్ డిసెంబర్ సెషన్ 2023 పరీక్షల్ని గతేడాది డిసెంబర్ 6 నుంచి 14 వరకూ నిర్వహించారు. దేశవ్యాప్తంగా 292 నగరాల్లో నిర్వహించిన ఈ పరీక్షల్లో మొత్తం 9.45 లక్షల మంది అభ్యర్ధులు రాశారు. ఈ ఫలితాలను ఇవాళ విడుదల చేశారు. ఫలితాలను యాక్సెస్ చేసేందుకు అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.ac.in ను అభ్యర్ధులు సందర్శించాల్సి ఉంటుంది. వీటిలో స్కోర్ కార్డుల్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఎన్టీయే వెల్లడించింది.

UGC NET December 2023 Results released- here is how to download score cards

యూజీసీ నెట్ ఫలితాలను ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.ac.in లో విడుదల చేస్తోంది. అభ్యర్ధులు ఫలితాలు తెలుసుకోవడానికి, స్కోర్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవడానికి వెబ్ సైట్ లోకి వెళ్లి డిసెంబర్ సెషన్ లింక్ పై క్లిక్ చేసి లాగిన్ వివరాలు ఎంటర్ చేయాలి. దరఖాస్తు నంబర్లు, పుట్టిన తేదీని ఉపయోగించి లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యాక తమ వివరాలు ఎంటర్ చేస్తే స్కోర్ కార్డులు కనిపిస్తాయి. వీటిని డౌన్ లోడ్ చేసి ప్రింట్ తీసుకుని ఉంచుకుంటే భవిష్యత్ అవసరాలకు పనికొస్తాయి.

యూజీసీ నెట్ పరీక్షలో ఉత్తీర్ణులైతే అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేదా రీసెర్చ్ ఫెలోస్ వంటి స్థానాలను పొందడంతో పాటు, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందే అవకాశం ఉంది. అలాగే యూజీసీ నెట్ పరీక్షకు సిద్ధమవుతున్న ఇతర విద్యార్థులకు కూడా వీరు శిక్షణ ఇవ్వగలరు. దీంతో యూజీసీ నెట్ పరీక్షలకు ప్రాధాన్యత ఉంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+