Year Ender 21023: ఈ ఏడాది టాప్ లేపిన గూగుల్, ఐఐఎం లీడర్ షిప్ కోర్సులు..!

భారత్ లో ఈ ఏడాది అత్యధికంగా పాపులారిటీ సంపాదించుకున్న కోర్సుల జాబితాను తాజాగా ఆన్ లైన్ కోర్సుల వెబ్ సైట్ కోర్స్ ఎరా విడుదల చేసింది. ఇందులో ఈ ఏడాది టాప్ 10 పాపులర్ అయిన కోర్సుల్లో గూగుల్ జనరేటివ్ ఏఐ కోర్సులతో పాటు ఐఐఎం అహ్మదాబాద్ లీడర్ షిప్ స్కిల్ కోర్సులు టాప్ లో నిలిచాయి. భారత్ లో విద్యార్దులు ఎక్కువగా వీటిని ఎంచుకుంటున్నట్లు తేలింది. కోర్స్ ఎరా విడుదల చేసిన రిపోర్టు వివరాలు ఓసారి పరిశీలిస్తే...

Coursera వివరాల ప్రకారం చూస్తే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పరిశోధనలు నాలుగు రెట్లు పెరిగాయని తేలింది. ఈ ఏడాది భారతీయులు ఎక్కువగా అధ్యయనం చేసిన రంగాల్లో జెన్ ఏఐ కంటెంట్ ఒకటి. దేశంలోని 22.2 మిలియన్లకు పైగా రిజిస్టర్డ్ విద్యార్దుల డేటాను అధ్యయనం చేసి నివేదిక విడుదల చేసింది. ఇందులో జెన్ ఏఐ (GenAI) కంటెంట్, IIM అహ్మదాబాద్ లీడర్‌షిప్ స్కిల్స్ కోర్సులు ఈ సంవత్సరం భారతదేశంలో అత్యంత ఆదరణ పొందినట్లు తేలింది.

Year Ender 21023: Google GenAI, IIM-A leadership courses among most popular courses this year

కోర్స్ ఎరా ప్రకటించిన వివరాల ప్రకారం భారతీయ విద్యార్దులు ఏడాదిలో ప్రతీ మూడు నిమిషాలకు తమ వెబ్ సైట్లో జెన్ ఏఐ కంటెంట్‌లో రిజిస్టర్ అవుతున్నట్లు తెలిపింది. ఈ డిమాండ్‌ను తీర్చడానికి ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, అధ్యాపకులు కోర్స్ ఎరాలో జనరేటివ్ ఏఐపై 35కు పైగా కోర్సులు, ప్రాజెక్టులు ప్రారంభించినట్లు నివేదిక చెబుతోంది. వీటిలో లక్షా 96 వేల మంది భారతీయ విద్యార్దులు రిజిస్టర్ అయ్యారు.

ఈ ఏడాది కోర్సు ఎరా వెబ్ సైట్ లో ప్రతీ ఒక్కరికీ జనరేటివ్ ఏఐ అనే ట్యాగ్ తో ప్రారంభించిన కోర్సులు ఆరు వారాల్లోనే పాపులర్ అయినట్లు తేలింది. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఈ కోర్సుల రిజిస్ట్రేషన్లలో రెండో స్ధానంలో నిలిచారు. అలాగే GenAI తర్వాత రెండో అత్యంత ఆదరణ పొందిన కోర్సు ఐఐఎం అహ్మదాబాద్ లీడర్‌షిప్ స్కిల్స్. ఇది ప్రభావం, అధికారం, పవర్ డైనమిక్స్, ఒత్తిడి నిర్వహణ, మహాభారత పాఠాల్నీ తమ కోర్సులో కవర్ చేస్తుంది.

2023లో భారతదేశంలో అత్యంత జనాదరణ పొందిన కోర్సులలో, ఐదు గూగుల్ హోస్ట్ చేస్తున్నవే ఉన్నాయి. ఇందులో ఫౌండేషన్స్ :డేటా, డేటా: ఎవిరివేర్, పైథాన్‌పై క్రాష్ కోర్సు, డిజిటల్ మార్కెటింగ్ మరియు ఇ-కామర్స్ ఫౌండేషన్; ఆస్క్ క్వశ్చన్స్ టూ మేక్ డేటా డ్రివెన్ డెసిషన్స్ మరియు ఫౌండేషన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఉన్నాయి. అలాగే ఆ తర్వతా IIM అహ్మదాబాద్ (లీడర్‌షిప్ స్కిల్స్ మరియు ప్రీ-MBA స్టాటిస్టిక్స్) రెండు కోర్సులు ఉన్నాయి. వీటితో పాటు పాపులర్ కోర్సుల్లో ఫైనాన్షియల్ మార్కెట్స్ బై యేల్ యూనివర్శిటీ, సూపర్ వైజ్డ్ మెషీన్ లెర్నింగ్ : రిగ్రెషన్ అండ్ క్లాసిఫికేషన్ బై స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ, డీప్‌లెర్నింగ్.ఏఐ , "ఎఐ ఫర్ ఎవ్రీవన్" కూడా టాప్ 10లో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+