కలలు గనే ధైర్యం చెయ్యొచ్చు: మెగాస్టార్ టిపికల్ ట్వీట్..
Megastar Chiranjeevi: రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఏడాది సెలబ్రేషన్స్ జోరుగా సాగాయి. అర్ధరాత్రి దాటేంత వరకూ జనం రోడ్ల మీదే ఉన్నారు. 2024కు గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికారు. ఈ తెల్లవారు జాము నుంచి ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. కిటకిటలాడుతున్నాయి. దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
అటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త ఏడాది సందడి నెలకొంది. స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు.. సినీ ప్రేక్షకులకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది తరహాలోనే ఈ సంవత్సరం కూడా టాలీవుడ్ మరెన్నో ఘన విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.

అదే సమయంలో- సెట్స్‌పై ఉన్న పలు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఒక్కటొక్కటిగా వెలువడుతున్నాయి కూడా. జూనియర్ ఎన్టీఆర్- జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో నిర్మాణంలో ఉన్న దేవర మూవీ కొత్త పోస్టర్ విడుదల అయింది. ఈ నెల 8వ తేదీన ఫస్ట్ గ్లింప్సెస్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది యూనిట్.
మెగాస్టార్ చిరంజీవి.. తన అభిమానులకు న్యూ ఇయర్ గ్రీటింగ్ తెలిపారు. 2023.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిరస్మరణీయమైనదని పేర్కొన్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకీ చారిత్రాత్మక సంవత్సరంగా ఆయన అభివర్ణించారు. ఆర్ఆర్ఆర్ సాధించిన ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డులను చిరంజీవి ప్రస్తావించారు.
గత ఏడాదిలో టాలీవుడ్ ఎన్నో జాతీయ అవార్డులను అందుకుందని, బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాలను నమోదు చేసిందని, రికార్డులను తిరగ రాసిందని అన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ.. అన్ని హద్దులను చెరిపివేసిందని, అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిందని చిరంజీవి వ్యఖ్యానించారు.
ఆస్కార్ స్థాయి అవార్డులపై కలలు గనే ధైర్యం చేయవచ్చని, వాటిని సాకారం చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయనే విషయాన్ని 2023వ సంవత్సరం చాటి చెప్పిందని అన్నారు. 2024లో కూడా ఇలాంటి విజయాలను టాలీవుడ్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అందుకుంటుందనే ఆశాభావాన్ని చిరంజీవి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications