ప్రభాస్ సినిమా కోసం గోడ దూకిన 70 ఏళ్ల బాలీవుడ్ నటుడు.. ఎందుకంటే ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నారు. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్.. సలార్, కల్కి సినిమాలతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం మారుతితో రాజా సాబ్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. రాజా సాబ్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొగా.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో హను రాఘవపూడి మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు ప్రభాస్.
ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సోషల్ మీడియా కోడై కూస్తుంది. రెండో ప్రపంచ యుద్దం కాలం నాటి బ్యాక్ డ్రాప్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని.. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. కాగా ఇన్ ఫ్లూయెన్సర్ ఇమాన్వీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని మారుమూల ప్రాంతంలో శరవేగంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ కోసం ఎప్పుడూ చేయని ఓ పని ఇప్పుడు చేశానంటూ 70 ఏళ్ల బాలీవుడ్ నటుడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ లోకి అడుగు పెట్టేందుకు ఆయన చాలా ఇబ్బంది పడ్డట్టు తెలుస్తోంది. ఏకంగా నిచ్చెన వేసుకుని గోడ దూకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను అనుపమ్ ఖేరే సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా, అది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది.
ఆ పోస్టులో..
నా 40 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో విధాలుగా షూటింగ్ లొకేషన్స్‌లోకి అడుగుపెట్టాను. కానీ ఈరోజు ఇలా సెట్‌లోకి వెళ్లడం ప్రత్యేకం గానే కాకుండా చాలా కామెడీగా ఉంది. ప్రస్తుతం ప్రభాస్ కొత్త సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఉన్నాను. కానీ మా డ్రైవర్ ఈ ప్రయాణాన్ని సాహసోపేతం చేయాలని అనుకున్నాడు. మేము ఒక అడవి లాంటి లొకేషన్‌కు చేరుకున్నాం.. కానీ అది డెడ్ ఎండ్ అని తెలిసింది. కారు రివర్స్ చేద్దామని ప్రయత్నించిణా కుదర్లేదు.
దాంతో ఏం చేయాలో తెలీక పక్కనే సినిమా షూట్ జరుగుతుండడంతో గోడ దూకి లొకేషన్‌లోకి అడుగుపెట్టానని ఆయన రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సదరు పోస్టుకు 'కుచ్ బీ హో సక్తా హై' అనే హ్యాష్ ట్యాగ్ యాడ్ చేశారు. 70 ఏళ్ల వయసులోనూ అనుపమ్ ఖేర్ ఇలా చేయడం హాట్ టాపిక్ అవుతోంది.












Click it and Unblock the Notifications