Tillu square: రొమాంటిక్ సీన్స్ ఎంజాయ్ చేసిన పెద్దాయన, వీడియో వైరల్
ఇటీవల విడుదలైన టిల్లు స్క్వేర్ మంచి టాక్‌తో సినిమా యువతను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కామెడీ కూడా ఉండటంతో అన్ని వర్గాల ఆడియన్స్ సినిమాకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రీమియర్ షోల నుంచి హిట్ టాక్ రావడంతో ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీసు వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల ముందు బారులు తీరుతున్నారు.
కాగా, మార్చి 9న విడుదలైన ఈ సినిమాకు యువత నుంచే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. తాజాగా, ఈ సీనిమాను చూసేందుకు వచ్చిన ఓ పెద్దాయన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమాలో భాగంగా సిద్ధూ, అనుపమ పరమేశ్వరన్ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశం ప్లే అవుతుండగా ఆ పెద్దాయన ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఆకట్టుకుంటున్నాయి.

ఈ సమయంలో పక్కన ఉన్న కొంతమంది యువకులు.. ఆ పెద్దాయనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ పెద్దాయన ఎక్స్‌ప్రెషన్స్‌కు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. పెద్దామనే కానీ మహానుభావుడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
#TilluSquare ஆ ஆ @anupamahere
— Esh Vishal (@eshvishal) March 31, 2024
Legend grand father...
pic.twitter.com/B7XG1XGE99
కాగా, టిల్లు స్క్వేర్ రెండు రోజులకు గానూ 40 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినినామాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. టిల్లు, టిల్లు స్క్వేర్ కూడా అనున్న స్థాయిలో విజయవంతం కావడంతో టిల్లు 3ని కూడా తెరకెక్కించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications