గుంటూరు కారం ఘాటు: మహేష్-శ్రీలీల కెమిస్ట్రీ అద్దిరిపోయిందంతే
Guntur kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం.. గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. థమన్ సంగీతాన్ని సమకూరచిన ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి అంటే జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
ఇప్పటికే ఈ సినిమా టీజర్.. అదరగొట్టింది. మహేష్ బాబు స్టామీనాను చాటి చెప్పింది. లక్షల్లో వ్యూస్ వచ్చాయి.. ఈ టీజర్‌కు. మహేష్ బాబులోని మాస్ హీరోయిజాన్ని బయటపెట్టింది. తలకు ఎర్ర టవల్, నోట్లు బీడీ, మాసిన గెడ్డం, గళ్ల చొక్కాతో క్రేజ్ కా బాప్ అనిపించేలా చేశాడు.

గుంటూరు కారం పోస్టర్లు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి. అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఎదురు చూసేలా చేస్తోన్నాయి. మాస్ లుక్‌తో కనిపించారు మహేష్ బాబు. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ నటిస్తోన్నారాయన.
ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ ప్రొమో విడుదలయింది. ఎదురొచ్చే గాలి.. ఎగరేస్తోంది చొక్కాపై గుండి.. అనే లైన్‌తో ఉన్న ప్రోమో ప్లస్ లిరికల్ సాంగ్ సినిమా సత్తా ఏంటో తెలియజేశాయి. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసేలా చేస్తోందీ మూవీ. మరోసారి బాక్సాఫీస్ బాక్సులు బద్దలవుతాయనే అంచనాలు ఉన్నాయి.
సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. మహేష్ బాబు, శ్రీలీలపై ఓ పాటను ప్రస్తుతం చిత్రీకరిస్తోన్నారు దర్శకుడు త్రివిక్రమ్. దీనికి సంబంధించిన ఓ స్టిల్‌ను నాగ వంశీ.. తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. రగ్డ్ లుక్సంలో ఓ మాస్ బీట్‌కు స్టిల్ ఇచ్చారు మహేష్, శ్రీలీల.
ఈ పాటతో గుమ్మడికాయ కొట్టేస్తారనే ప్రచారం ఉంది. షూటింగ్ ముగిసిన తరువాత వారం రోజుల పాటు మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్తారని చెబుతున్నారు. ఆ తరువాత సినిమా ప్రమోషన్స్‌లో తీరిక లేకుండా గడుపుతారు. 6 లేదా 7వ తేదీల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications