ఘనంగా అమీర్ ఖాన్ మూడో పెళ్లి.. మాజీ భార్యలు, పిల్లల సమక్షంలో
సెలబ్రిటీల లైఫ్ లో డేటింగ్, విడాకులు, మ్యారేజ్ లు కామన్ గానే వినిపిస్తుంటాయి. సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు, హీరోయిన్లు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ ఫెక్ట్ గా పేరుగాంచిన అమీర్ ఖాన్ తాజాగా మూడో పెళ్లి చేసుకున్నారు. మాజీ భార్యలు, పిల్లలు, బంధువుల సమక్షంలో ఘనంగా ఇవాళ ఆయన వివాహం చేసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు అమీర్ ఖాన్.. తన ప్రేయసి గౌరీ స్ప్రాట్ ను వివాహమాడి.. మ్యారేజ్ పేపర్స్ మీద సంతకాలు చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే అమీర్ ఖాన్ ఇప్పటికే రెండు వివాహాలు చేసుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలోనే 1986 లో రీనా దత్తాను ప్రేమించి సీక్రెట్ వివాహం చేసుకున్నారు. దాదాపు 15 ఏళ్ల పాటు వీరి దాంపత్యం అన్యోన్యంగానే సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. జునైద్ ఖాన్, ఐరా ఖాన్.. అయితే అనుకోని కారణాలతో 2002 లో వీరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.

ఇక ఆ తర్వాత 2005 లో కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు అమీర్ ఖాన్. ఈమె లగాన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ సమయంలోనే ఇరువురి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. అయితే 15 ఏళ్లు కలిసున్న తర్వాత 2021 లో వీరు విడిపోయారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు ఆజాద్ రావ్ ఖాన్. ఇక తాజాగా గౌరీ స్ప్రాట్ ను పెళ్లాడారు. ఈమెతోనైనా జీవితాంతం కలిసి ఉంటారో లేదో చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే అమీర్ ఖాన్ 3 ఇడియట్స్ అనే సినిమాకు సీక్వెల్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications