విజయ్ లీక్డ్ మూవీ చూశా: ఈ టైమ్ లో అది గానీ విడుదలైతే కొంపలు అంటుకుంటాయ్
తమిళనాడు ప్రస్తుతం హాట్ హాట్ గా ఉంది. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం, మరోవైపు టీవీకే అధినేత విజయ్ లేటెస్ట్ మూవీ జన నాయగన్ హెచ్ డీ ప్రింట్ లీక్ కావడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఎప్పుడో ఈ ఏడాది జనవరిలో విడుదల కావాల్సిన సినిమా అది. సెన్సార్ లో చిక్కుకుంది. న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో హెచ్ డీ ప్రింట్ ఫుల్ మూవీ లీక్ కావడం చర్చనీయాంశమైంది.
జన నాయగన్' లీకైన క్లిప్‌లను వీక్షించినట్లు ప్రముఖ నటి కస్తూరి శంకర్ అంగీకరించింది. వాట్సాప్, ఇతర ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అవి తనకు అందాయని అన్నారు. అందులో కొన్ని లీక్డ్ క్లిప్‌లను చూశానని తెలిపారు. టీవీకే ఎన్నికల కోసం రూపొందించిన మూడు గంటల ప్రచార చిత్రంగా దీన్ని అభివర్ణించారు. ప్రస్తుతం ఇది అందరి నోటా నానుతోందని, సినిమా గురించి కొత్త విషయాలు తెలుసుకున్నానని వ్యాఖ్యానించారు.

ఈ సినిమా విడుదల అయితే డీఎంకే లేదా ఏఐఏడీఎంకే, భారతీయ జనతా పార్టీలకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని తేల్చి చెప్పారు. ఎన్నికల సమయంలో రాజకీయంగా టీవీకేకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని తేల్చి చెప్పారు. టీవీకే ప్రచార శైలిెకి దగ్గరగా ఈ మూడు గంటల జన నాయగన్ మూవీ ఉందని, సెన్సార్, ఎడిట్‌లు లేకుండా ఈ చిత్రం మొత్తం కూడా ఆన్‌లైన్‌లో ఉందని ఆమె తెలిపారు. రాజకీయంగా విజయ్ కు లబ్ది కలిగించాలనే ఉద్దేశంతోనే లీక్ చేసి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. తమ ఉద్దేశం ప్రజలకు చేరాలని స్పష్టంగా కోరుకున్నట్లు కనిపించిందని అన్నారు.
తమిళనాడులో సినిమా థియేట్రికల్ విడుదలను అధికార డీఎంకే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుందని కస్తూరి ఆరోపించారు. తమిళనాడు రాజకీయాలపై దృష్టి పెట్టడం వల్లే జన నాయగన్ సినిమా విడుదల విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేసిందని అభిప్రాయపడ్డారు. డీఎంకేకు సపోర్ట్ గా తీసిన టీఎన్ 2026 అదే రోజు విడుదల కావడాన్ని గుర్తు చేశారు. విజయ్ సానుభూతిపరులే దీన్ని లీక్ చేసి ఉండొచ్చనీ అన్నారు.
లీక్‌పై కేవీఎన్ ప్రొడక్షన్స్ ఫిర్యాదు మేరకు చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు సాగిస్తోన్నారు. తాజాగా ఈ వ్యవహారంలో ఆరుమందిని అరెస్టు చేశారు. లీక్ పై రిషబ్ షెట్టి, చిరంజీవి, శివకార్తికేయన్, విజయ్ దేవరకొండ వంటి పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. దీన్ని ఖండించారు. జన నాయకన్ లో కీలక పాత్ర పోషించిన పూజా హెగ్డే, మమిత బైజు లీక్‌పై నిరాశ వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications