నా కొడుకు చనిపోవాలని కోరుకున్నా.. అదే జరిగింది కానీ !
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రసాద్ బాబు. ఒకప్పుడు హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. బాపు దర్శకత్వం వహించిన 'మన ఊరి పాండవులు', రజనీకాంత్ నటించిన 'అంతులేని కథ' చిత్రాల్లో ఆయన పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేశాయి. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలతో పాటు.. ప్రభాస్, మహేష్ బాబు నేటి తరం హీరోలతో కూడా పనిచేశారు.
అలానే సినిమాలకే పరిమితం కాకుండా బుల్లితెరపై కూడా అనేక సీరియల్స్ మెరిశారు. 'నిన్నే పెళ్లాడతా' (జెమిని టీవీ), 'జయం' (ఈటీవీ), 'చిన్న కోడలు' (జీ తెలుగు), 'రాములమ్మ' (మా టీవీ) వంటి సీరియల్స్‌లో కీలకపాత్రలు పోషించారు.

నా కొడుకు చనిపోవాలనుకున్న...
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ప్రసాద్ బాబు చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. తన కొడుకు గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. నా కొడుకు మానసిక వికలాంగుడు. వాడు మాట్లాడలేడు. వాడిని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడిని. నేను చనిపోయాక వాడిని ఎవరు చూసుకుంటారు అనే భయంతోనే.. తాను బతికుండగానే చనిపోవాలని కోరుకున్నాను.
ఒకసారి క్రికెట్ ఆడుతుండగా వడదెబ్బతో వాడికి హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడే చనిపోయాడు. అప్పుడు నా వయసు 30 ఏళ్లు. వాడు చనిపోయిన బాధకన్నా.. వాడికి భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు ఉండవని అనిపించి కొంత సంతోషం కూడా కలిగింది అని చెప్పుకొచ్చారు.

కుటుంబం..
ప్రసాద్ బాబు మరో కుమారుడు శ్రీకర్ అనేక సీరియల్స్‌లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. శ్రీకర్ భార్య సంతోషిణి కూడా హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది. 'జై' (డైరెక్టర్ తేజ), 'నువ్వు వస్తానంటే నేనొద్దంటానా' చిత్రాల్లో నటించిన ఆమె.. వివాహం తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రసాద్ బాబు కూడా సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
చిరుతో రూమ్ షేరింగ్..
ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం చెన్నైలో ఉండేది. అప్పట్లో ప్రసాద్ బాబు, సుధాకర్, నారాయణ రావు, చిరంజీవి ఒక్కరూమ్‌లో ఉండేవాళ్లు. ప్రసాద్ బాబుకి మొదట్లో మంచి హీరో అవకాశాలు వచ్చాయి. సుధాకర్, నారాయణ రావు, చిరంజీవిలు ఆయన సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేశారు. ఆ తర్వాత చిరంజీవి హీరోగా అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ అయ్యారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications