ఆ పని చేయడం ఇష్టం లేక 3 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేశాం..

బెట్టింగ్‌ యాప్స్‌ ముందు నమ్మిస్తాయి.. ఆ తర్వాత ముంచేస్తాయి అనడంలో సందేహం లేదు. కానీ ప్రస్తుత కాలంలో ఈజీ మనీ కోసం ప్రజలు ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు. కష్టపడి పనిచేసే డబ్బులు సంపాదించడం కన్నా అడ్డదారులు తొక్కడం, లేదా బెట్టింగ్ ద్వారా డబ్బులను సంపాదించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొందరు చివరకు వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆన్లైన్ బెట్టింగ్ ల ఘటనలో పలువురు చనిపోయిన విషయం తెలిసిందే. కానీ ఇలాంటి యాప్స్‌ను బుల్లితెర సెలబ్రిటీల నుంచి సినిమా స్టార్స్‌ వరకు కూడా ప్రమోట్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తెలంగాణ సర్కారు బెట్టింగ్ యాప్స్ పై కొరడా ఝుళిపిస్తోంది. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేస్తోన్న 11 మంది సెలబ్రిటీలకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఈ మేరకు పంజాగుట్ట పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన వారిలో సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, టీవీ నటులు ఉన్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌, హర్ష సాయి, టెస్టీ తేజ, కిరణ్‌ గౌడ్‌, విష్ణుప్రియ, యాంకర్‌ శ్యామల, రీతూ చౌదరి, ఆర్టిస్ట్ సురేఖా వాణి కుమార్తె సుప్రీత సహా పలువురుపై కేసు ఫైల్ చేశారు. పలువురు ఇప్పటికే విచారణకు కూడా హాజరయ్యారు.

actor-siva-balaji-shocking-comments-on-betting-apps-promotion

అయితే ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడంతో పలువురు ప్రముఖులు ఈ ప్రమోషన్స్ కి దూరంగా ఉంటున్నారు. ఈ మేరకు బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్‌ చేయమని తనను కూడా సంప్రదించారని నటుడు, బిగ్‌బాస్‌ విన్నర్‌ శివబాలాజీ తెలిపారు. తన భార్య, నటి మధుమితతో కలిసి ఇటీవల ఓ సాంగ్‌ చేశాడు శివ బాలాజీ. ఈ పాట రిలీజైన తరుణంలో వీరిద్దరూ ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మాట్లాడుతూ బెట్టింగ్ యాప్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేయమని రూ.3 కోట్లు ఆఫర్‌ ఇచ్చారని శివ బాలాజీ తెలిపారు. ట్రేడింగ్‌, బెట్టింగ్‌ అంటూ ప్రమోట్‌ చేయమని అడుగుతుంటారని చెప్పారు. కానీ అభిమానులను ఫ్యామిలీగా భావిస్తామని.. అందుకే పొరపాటున కూడా తప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వమని తేల్చి చెప్పారు. అందుకే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌ చేయలేదని వివరించారు. ఇకపై కూడా చేయమని.. అటువంటివి ఎంకరేజ్ చేయొద్దని స్పష్టం చేశారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ హీరోగా పరిచయమైన నటుడు శివబాలాజీ.. ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ, చందమామ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే హీరోగా ఆ స్థాయిలో మెప్పించకపోవడంతో హీరోకి తమ్ముడి పాత్రలు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ ఇండస్ట్రీలోనే రాణిస్తున్నారు. ఇక నటి మధుమతితో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం మంచు విష్ణు కన్నప్ప సినిమాలో శివ బాలాజీ నటిస్తున్నారు.

Take a Poll

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+