ఎవరైనా మెగా ఫ్యామిలీని తిడితే వాళ్లేం చేస్తారో తెలుసా?
మెగా ఫ్యామిలీ అనే పదానికి ఆద్యుడు మెగాస్టార్ చిరంజీవి. స్వయంకృషితో ఉన్నతస్థాయికి చేరుకొని తెలుగులో అగ్ర కథానాయకుడిగా రాణిస్తున్నారు. తర్వాత ఆయన సోదరుడు నాగబాబు పరిశ్రమలోకి వచ్చినప్పటికీ హీరోగా నిలదొక్కుకోలేదు. క్యారెక్టర్ యాక్టర్లు చేస్తూ వచ్చారు. చిరంజీవి మరో సోదరుడు పవన్ కల్యాణ్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ పవర్ స్టార్ గా ఆవిర్భవించారు. రాజకీయ పార్టీ జనసేనను స్థాపించిన పవన్ ఏపీ ఎన్నికల్లో పోటీచేసేందుకు సమాయత్తమవుతున్నారు. వీరి తర్వాత తరంలో కూడా మెగా కుటుంబం నుంచి హీరోలు వచ్చారు.
పరిశ్రమలో బలం సంపాదించుకోవడంతోపాటు వీరికంటూ కొందరు నిర్మాతలు, దర్శకులు, నటులు ఏర్పడ్డారు. దీంతో దేశంలో ఒక బలమైన సినీ కుటుంబంగా ఆవిర్భవించింది. పరిశ్రమలో ఎవరైనా నటులు ఈ కుటుంబాన్ని విమర్శిస్తే వారికి సినిమా అవకాశాలు రాకుండా చేస్తారంటూ వార్తలు వస్తుంటాయి. ఇటీవలే శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, పృథ్వీరాజ్ లాంటివారిని ఉదాహరణలుగా చూపిస్తారు. పోసాని ఇంటిపై మెగా అభిమానులు రాళ్లు రువ్వి నానా యాగీ చేశారు. పృథ్వీరాజ్ జనసేనలోకి రావడంతో తిరిగి అతనికి సినిమా అవకాశాలు వస్తున్నాయి.

తమ కుటుంబాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయించేది కూడా మెగా కుటుంబ సభ్యులే అని మంచు విష్ణు బహిరంగంగానే ఎన్నోసార్లు చెప్పాడు. మెగా కుటుంబానికి, మంచు కుటుంబానికి కోల్డ్ వార్ నడుస్తుంటుంది. పరిశ్రమలో చాలామంది దర్శకులు మెగా కుటుంబాన్ని వ్యతిరేకించారు. వారికి అవకాశాలు రాకుండా మెగా కుటుంబం అడ్డుపడుతుంటుందని వార్తలు వస్తుంటాయి. వాటిల్లో వాస్తవమెంతో వారికే తెలియాలి. హీరోలైనా, తోటి నటులైనా, హీరోయిన్లయినా, దర్శకులైనా, నిర్మాతలైనా.. ఇలా ఏ విభాగానికి చెందినవారు విమర్శించినా వారికి అవకాశాలు రావని చెబుతుంటారు. ఏడెనిమిది మంది హీరోలు, నాలుగైదు ప్రొడక్షన్ హౌస్ లు కూడా ఉండటం, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటివారు పాన్ ఇండియా విజయాలు అందుకోవడంతో వీరికి వ్యతిరేకంగా మాట్లాడితే అవకాశాలు రావు అనడంలో ఎటువంటి సందేహం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.












Click it and Unblock the Notifications