ఫోన్ చేసి మరీ ఆ పనికి రమ్మంటారు..కాస్టింగ్ కౌచ్‌పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
సినిమా వారి జీవితాలుపైకి అద్దాల మేడలా అందంగా కనిపిస్తుంటాయి. కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలను వారు ఫేస్ చేస్తుంటారు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి. కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు.
పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి.కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు.

కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆఫర్స్ రావడం లేదని ఇటీవలే ఓ తెలుగు నటి వెల్లడించారు. తాజాగా కాస్టింగ్ కౌచ్ గురించి బాలీవుడ్ హీరోయిన్ అభా రత్నా.డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి సిరీస్‌లో అభా రత్నా కీలక పాత్రలో నటించింది. ఇందులో మనీషా కొయిరాలా యుక్తవయసు అమ్మాయి పాత్రలో హిందీ నటి అభా రత్నా నటించింది. అభా రత్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..లైంగిక వేధింపులు ఇండస్ట్రీలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది.
కెరీర్ తొలినాళ్లలో కొందరు పరొక్షంగా కాస్టింగ్ కౌచ్ గురించి పరొక్షంగా మాట్లాడేవారని తెలిపింది. కొందరు ఫోన్ చేసి మీటింగ్ ఉంది రమ్మని చెప్పేవారని.. కానీ అది అడిషన్ కాదని ముందే చెప్పేవారని తెలిపింది. అప్పట్లో ఆ ఫోన్ కాల్స్ గురించి అంతగా అర్థమయ్యేది కాదని.. ఫోన్ చేసి మీటింగ్ రమ్మంటారు.. కానీ అడిషన్ కాదంటున్నారేంటీ అంటూ సందీగ్దంలో పడిపోయేదాన్ని. ఎందుకో అక్కడికి వెళ్లాలనిపించేది కాదు. అందుకు ధైర్యం కూడా రాలేదు. కానీ ఎప్పుడు తనను నేరుగా ఎవరు సంప్రదించలేదని.. నేరుగా అలాంటి పరిస్థితులు ఎదురుకాలేదని తెలిపింది. కాస్టింగ్ కౌచ్ గురించి అభా రత్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.












Click it and Unblock the Notifications