Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నటి, నిర్మాత కృష్ణవేణి మృతి.. సీఎం చంద్రబాబు, బాలయ్య, లోకేష్ సంతాపం

సీనియర్ నటి, నిర్మాత కృష్ణవేణి తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయస్సు 102 ఏళ్ల కాగా.. ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో చనిపోయినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఎన్టీఆర్‌ను మన దేశం సినిమాతో తెరకు పరిచయం చేశారు నిర్మాత కృష్ణవేణి. ఎన్టీఆర్ తో పాటు ఘంటసాల వెంకటేశ్వరరావు, గాయని పి.లీల వంటి ఎంతోమంది ప్రముఖులను మనదేశం చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ సినిమాకు ఓ వైపు నిర్మాతగా వ్యవహరిస్తూనే ఎన్టీఆర్‌కు జంటగా అందులో నటించారు. బాలనటిగా, నటిగా, నిర్మాతగా ఎన్నో మరుపురాని చిత్రాలను పరిశ్రమకు అందించారు. ఆమె మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో 1924 డిసెంబర్‌ 24న కృష్ణవేణి జన్మించారు. డ్రామా ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ఆరంభించిన కృష్ణవేణి.. 1936లో విడుదలైన సతీ అనసూయతో బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టారు. 1939లో మీర్జాపురం జమీందార్‌తో ఆమె వివాహం జరిగింది. ఆ తర్వాత శోభనాచల స్టూడియోస్‌ సారథ్యంలో పలు సినిమాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు. దక్షయజ్ఞం, జీవన జ్యోతి సహా పలు చిత్రాల్లో కృష్ణవేణి నటించారు. ఇటీవల నిర్వహించిన ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలలో, అంతకుముందు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో కృష్ణవేణిని ఘనంగా సత్కరించారు.

Actress and producer Krishnaveni passed away

కృష్ణవేణి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తెలుగు సినీకీర్తిని కృష్ణవేణి నలుదిశలకు చాటారన్నారు. అలానే నటిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తెలుగు సినీ చరిత్రలో కృష్ణవేణిది ఓ ప్రత్యేక అధ్యాయమని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. కృష్ణవేణి బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నటజీవితానికి బాట వేసిన కృష్ణవేణి శివైక్యం చెందడం బాధాకరమని అన్నారు.

అలానే తెలుగు సినీ పరిశ్రమకు వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి కృష్ణవేణి అని మంత్రి నారా లోకేష్ వాపోయారు. తెలుగు చలన చిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారని.. స్టూడియో అధినేతగా, నిర్మాతగా, నటిగా ఎనలేని సేవలు అందించారన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని పోస్ట్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+