Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అతనితో అలా చేసి తప్పు చేశా - ఉదయ కిరణ్ హీరోయిన్

ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను తన అందం, అభినయంతో ఆకట్టుకున్న నటి అనిత హస్సానందని. 2001లో తేజ దర్శకత్వంలో వచ్చిన 'నువ్వు నేను' చిత్రంతో అరంగేట్రం చేసింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి, ఉదయ్ కిరణ్‌తో కలిసి ఆమె కెమిస్ట్రీ యువతను ఎంతగానో ఆకట్టుకుంది. 'వసుంధర' పాత్రలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది.

సినిమా కెరీర్..

ఆ తర్వాత మళ్లీ ఉదయ్ కిరణ్‌తో కలిసి 'శ్రీరామ్' సినిమాలో కూడా నటించింది. అలానే 'తొట్టి గ్యాంగ్', 'నిన్నే ఇష్టపడ్డాను', 'ఆడంతే అదో టైపు', 'నేను పెళ్లికి రెడీ' సినిమాలు ప్రేక్షకుల్లో ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. చివరిగా తెలుగులో 2016లో 'మనలో ఒక్కడు' అనే సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.

actress-anita-hassanandani-shocking-comments-on-her-break-up

సీరియల్స్ లోనూ హవా..

సినిమాలకు ధీటుగా అనిత హస్సానందని టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఆమె నటించిన పలు హిందీ సీరియల్స్ దేశవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించిపెట్టాయి. 'కబీ సౌతన్ కబీ సహేలీ', 'కావ్యంజలి', 'క్యూంకీ సాస్ భీ కబీ బహు థీ', 'కహానీ హమారే మహాభారత్ కీ', 'యే హై మొహబ్బతేన్' సీరియల్స్ లో నటించి మెప్పించింది. 'నాగిన్' సిరీస్ లోని 'విశాఖ' పాత్రలో ఆమె నటన, గ్లామర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ పాత్ర ఆమెకు మరింత స్టార్‌డమ్‌ను తీసుకొచ్చింది. అంతేకాకుండా, 'ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ', 'నచ్ బలియే', 'కామెడీ నైట్స్ బచావో' వంటి రియాలిటీ షోలలోనూ అనిత పాల్గొని, తన ప్రతిభను చాటుకుంది.

కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ తనదైన ముద్ర వేసుకుంది. టీవీ రంగంలోనూ అనేక విజయవంతమైన సీరియల్స్‌లో నటించి, దేశవ్యాప్తంగా అశేష ప్రేక్షకాదరణ పొందింది. 'నాగిన్' వంటి సీరియల్స్‌తో ఆమెకు విపరీతమైన పాపులారిటీ లభించింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టనుందని తెలుస్తోంది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనిత తన లవ్ స్టోరీ, బ్రేకప్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా మారింది.అదే సమస్య..

actress-anita-hassanandani-shocking-comments-on-her-break-up

అదే సమస్య..

గతంలో అనిత బాలీవుడ్ నటుడు ఎజాజ్ ఖాన్‌ను ప్రేమించింది. వీరి ప్రేమ వ్యవహారం చాలా కాలం నడిచింది, కానీ ఆ తర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. ఈ బ్రేకప్ గురించి అనిత మాట్లాడుతూ.. నా జీవితంలో ఉన్న కొన్ని శాశ్వత సంబంధాలలో ఒకటి ఎజాజ్‌తో. నేను నా తల్లికి వ్యతిరేకంగా వెళ్లి అతనిని ప్రేమించాను. అతను వేరే మతానికి చెందినవాడు కాబట్టి మా సంబంధాన్ని మా అమ్మ వ్యతిరేకించింది. అతను ముస్లిం, నేను హిందువును. అతను నన్ను ఎప్పుడూ నేరుగా తిరస్కరించలేదు, కానీ ఎప్పుడూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండేవాడు. కానీ ఆ రిలేషన్ ఎక్కువ కాలం నిలబడలేదని చెప్పుకొచ్చింది.

ఎవరైనా మిమ్మల్ని మార్చాలని ప్రయత్నిస్తే అది ప్రేమ కాదు. ఇది నాకు అప్పుడు అర్థం కాలేదు, ఎందుకంటే నేను అతనితో పిచ్చి ప్రేమలో ఉన్నాను. వాటన్నింటినీ అధిగమించడానికి నాకు ఏడాది పట్టింది. వారి ఫోన్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన సమస్య. వ్యక్తి తన ఫోన్‌ను దాచిపెడితే, ఖచ్చితంగా ఏదో తప్పు జరిగిందని అర్థం. ఒక వ్యక్తి మిమ్మల్ని మీ కుటుంబం, స్నేహితుల నుంచి దూరం చేయకూడదు అని అనిత తన అనుభవాలను పంచుకుంది.

అనిత తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల తర్వాత, 2013 అక్టోబర్ 14న గోవాలో కార్పొరేట్ ప్రొఫెషనల్ రోహిత్ రెడ్డిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె భర్త, కుమారుడితో సంతోషంగా జీవితాన్ని గడుపుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+