పెళ్లైన ఏడాదికే స్టార్ హీరోయిన్ విడాకులు..రెండో పెళ్లి కూడా కథ కంచికే..!
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేకుండాపోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. తరువాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి.
భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. తెలుగులో నాగచైతన్య-సమంత, పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్, డైరెక్టర్ క్రిష్, చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక ఇలా చాలామంది తెలుగు సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. తమిళంలో కమల్ హాసన్ , ధనుష్, వంటి వారితో పాటు, బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్లు సైతం తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.తాజాగా తమిళ స్టార్ హీరో జయం రవి సైతం తన వైవాహిక జీవితానికి గుడ్ చెప్పారు.

ఓ హీరోయిన్ ఒకటి కాదు ఏకంగా రెండుసార్లు విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు చాహత్ ఖన్నా. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ బాలీవుడ్ జనాలకు ఈ భామ సుపరిచితమే."బడే అచ్ఛే లక్తే హై", "కుబూల్ హై", "ధూప్ ఛావ్", "హీరో", "ధన్యవాదాలు", "యాత్రిస్" వంటి సినిమాలు , వెబ్ సిరీస్‌ల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. చాహత్ ఖన్నా కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు 20 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది. 2006లో భరత్ నర్సింహను వివాహం చేసుకుంది. ఇద్దరూ 6 సంవత్సరాలు డేటింగ్ చేశారు.
తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే ఏడాదిలోపే వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకే చాహత్ ఖన్నా మరో వ్యక్తితో ప్రేమలో పడింది.చాహత్ ఖన్నా 2013 సంవత్సరంలో ఫర్హాన్ మీర్జాతో మళ్లీ వివాహం చేసుకున్నారు. చాహత్ ఖన్నా రెండో వివాహం సైతం ఎక్కువ రోజులు కొనసాగలేదు.రెండో భర్త గృహ హింస పెట్టాడని చాహత్ విడాకులు తీసుకుంది. చాహత్ ఖన్నాకు ఒక కూతురు కూడా ఉంది. ఎప్పుడూ తన కుమార్తెతో ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది.












Click it and Unblock the Notifications