అతనితో శృంగారం అదిరిపోయింది.. స్టార్ హీరోయిన్ హాట్ కామెంట్స్ (వీడియో)

సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్‌ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతుంటారు. తాజా ఓ హాలీవుడ్ హీరోయిన్ తన జీవితంలో ఎదురైనా శృంగారం గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది.

ప్రముఖ హాలీవుడ్ నటి చార్లీజ్ థెరాన్ (49) ఇటీవల తన రొమాంటిక్ రిలేషన్‌షిప్‌ల గురించి కాల్ హర్ డాడీ పోడ్‌కాస్ట్లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. షాన్ పెన్, స్టువర్ట్ టౌన్‌సెండ్, క్రెగ్ బియర్కో, స్టీఫన్ జెంకిన్స్ వంటి ప్రముఖులతో గతంలో డేటింగ్ చేసిన ఆమె, గత ఐదేళ్లుగా ఒంటరిగానే జీవిస్తోంది. అసంతృప్తికరమైన సంబంధాల కారణంగా పెళ్లిపై తనకు ఆసక్తి తగ్గిందని థెరాన్ వెల్లడించింది.

actress Charlize Theron comments on romantic relationships

అయితే, ఇటీవల 26 ఏళ్ల యువకుడితో జరిగిన వన్ నైట్ స్టాండ్ అనుభవం తనకు ఎంతో కిక్ ఇచ్చిందని ఆమె బోల్డ్‌గా చెప్పింది. అతనితో రొమాన్స్ అద్భుతంగా అనిపించిందని, 20 ఏళ్ల వయసులో ఇలాంటి అనుభవాలు కలిగి ఉంటే బాగుండేదని ఆమె నిర్మొహమాటంగా పేర్కొంది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు, వ్యాపారంతో బిజీగా ఉన్న థెరాన్, లైంగిక జీవితం కోసం తగిన సమయం కేటాయించలేకపోవడంపై నిరాశ వ్యక్తం చేసింది.

మహిళలు లైంగిక సంబంధాలలో తమ ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలని, పడకగదిలో నమ్మకంగా ఉండాలని ఆమె సూచించింది. చార్లీజ్ థెరాన్ చేసిన ఈ వ్యాఖ్యలు మహిళల లైంగిక ఆనందం, ఆత్మవిశ్వాసం గురించి బహిరంగ చర్చకు దారితీస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+