జయసుధ చిన్న తప్పు ఖరీదు రూ.200 కోట్లు!
తెలుగు సినీ పరిశ్రమలో ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించగలిగేవారిలో జయసుధ ఒకరు. అందుకే ఆమెను సహజ నటి అంటారు. దాదాపు 40 సంవత్సరాలకు పైబడి పరిశ్రమలో కొనసాగుతున్నారు. కొన్ని సంవత్సరాల తరబడి సూపర్ హిట్లు సాధించిన జయసుధ తన రెండో ఇన్నింగ్స్ లో కూడా విభిన్న రకాల పాత్రలను పోసిస్తూ పరిశ్రమలో దూసుకువెళుతున్నారు. అమ్మ, అమ్మమ్మ, బామ్మ పాత్రలతో అలరిస్తున్నారు. అటువంటి జయసుధ తన కెరీర్ లో కోట్లరూపాయల ఆస్తిని కూడబెట్టారు.
కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టడంతోపాటు మరికొన్ని కూట్ల రూపాయల ఆస్తులను కూడా పోగొట్టుకున్నారు. ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలను తెలియజేశారు. ఆస్తులు పెరగాలంటే అదృష్టం కూడా కలిసిరావాలని, తన సొంత సినిమాలవల్లే కోట్ల రూపాయలను నష్టపోయానన్నారు. అలాగే చెన్నైలో ఓ ప్రాపర్టీ విషయంలో రూ.100 కోట్లు కోల్పోయినట్లు తెలిపారు.

ఒక స్థలం తీసుకొని భవనం నిర్మించారు. ఈ విషయంలో జయసుధను అందరూ కొనియాడారు. శోభన్ బాబు అయితే మరీ మరీ అభినందించారు. ఆ తర్వాత కొన్ని పరిణామాలతో ఆ భవనం అద్దె తీసుకోవడానికి కూడా వెళ్లలేదు. దీంతో దాన్ని అమ్మాల్సి వచ్చింది. అలా అమ్మకుండా ఉన్నా రూ.వందల కోట్లు వచ్చేవంది. మరోచోట 9 ఎకరాల భూములను కొనుగోలు చేశారు. అయితే ఆ భూమిలో నీళ్లు పడకపోవడంతో అమ్మేసింది. దాని విలువ కూడా రూ.100 కోట్లుగా ఉంది. రజనీకాంత్ ఫామ్ హౌస్ పక్కనే ఉంటుంది. తమిళ డైరెక్టర్, రచయిత గుహనాథన్ తన పేరును జయసుధ గా మార్చినట్లు చెప్పింది. జ్యోతి సినిమాతో కెరీర్ ముందుకు వెళ్లింది. శ్రీదేవి, జయప్రద లాంటి హీరోయిన్లతో మంచి అనుబంధం ఉండేది.












Click it and Unblock the Notifications