Jayasudha: తన భర్త అందుకే ఆత్మహత్య చేసుకున్నాడు.. చెప్పేసిన జయసుధ..!
ప్రముఖ నటి జయసుధ తన భర్త మరణంపై మొదటి సారిగా స్పందించారు. తన భర్త చనిపోవడానికి అప్పులు కారణం కాదని తేల్చి చెప్పారు. జయసుధ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. యాంకర్ జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య గురించి అడిగారు. నితిన్ కపూర్ మరణానికి జయసుధ కారణమంటూ అప్పుడు వార్తలు వచ్చాయి. అస్సలు ఏం జరిగింది అని జయసుధను అడిగినట్లు తెలిసింది.
దీనిపై జయసుధ స్పందించారు. తన భర్త ఆత్మహత్య చేసుకోవడానికి తాను కారణం కాదని చెప్పారు. అయితే సినిమా వాళ్ల గురించి ఇష్టమొచ్చినట్లుగా రాస్తారు. అస్సలు నిజమెంటో తెలుకోరు. తమకు అప్పులే లేవు. అప్పులు లేనప్పుడు వాటిని తీర్చలేక ఎలా చనిపోతాడని అన్నారు. నితిన్ సోదరుడు, నితిన్ బంధువుల్లో ఇద్దరు లేడీస్ ఆత్మహత్య చేసుకున్నట్లు జయసుధ తెలిపారు.

నితిన్ కూడా అలాగే ఆత్మహత్య చేసుకుంటాడని భయపడినట్లు పేర్కొన్నారు. నితిన్ అలా జరగకూడదని చాలా ప్రయత్నించినట్లు చెప్పారు. తాను, తన అత్తగారు నితిన్ ఆత్మహత్య చేసుకోకుండా అపడానికి ప్రయత్నించినట్లు వివరించారు. అయినప్పటికీ నితిన్ కాపాడుకోలేకపోయామని జయసుధ విచారం వ్యక్తం చేశారు. తమ భవిష్యత్ తరాలకు ఇలాంటి పరిస్థితి రావొద్దని కోరుకుంటున్నట్లు చెప్పారు.
నితిన్ చనిపోయిన తర్వాతా చాలా బాధపడినట్లు తెలిపారు. అప్పుడు తనకు తన కుటుంబం మద్దతు ఇచ్చినట్లు జయసుధ వివరించారు. నితిన్ నిర్మాత పలు సినిమాలు నిర్మించారు. అందులో మేరా పతి సిర్ఫ మేరా హై, వింత కోడళ్లు, కలికాలం, హ్యాండ్సప్, ఆది దంపతులు సినిమాలు ఉన్నాయి. కాగా నితిన్ 2017లో బలవన్మరణానికి పాల్పడ్డారు. జయసుధ, నితిన్ దంపతులు కుమారుడు నిహర్ కపూర్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నాడు. రికార్డు బ్రేక్ సినిమాతో మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిహర్ పవన్ కల్యాణ మూవీ హరి హర వీరమల్లులో నటిస్తున్నారు.












Click it and Unblock the Notifications