జైల్లో అల్లు అర్జున్‌ను న్యూడ్‌గా ఉంచారా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ జనసందోహం ఏర్పడింది. ఈక్రమంలో ఓ మహిళ మరణించారు. ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
వైద్య పరీక్షలు అనంతరం అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టులో హాజరపరిచారు. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ తరుఫు న్యాయవాదులు హైకోర్టు తలుపులు తట్టారు. ఎట్టకేలకు హైకోర్టు అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేసింది. 4 వారాల మధ్యంతర బెయిల్‌తో పాటు, రూ.50 వేల పూచీకత్తుతో పర్సనల్ బాండ్ మీద అల్లు అర్జున్‌ను విడుదల చేయడం జరిగింది. అల్లు అర్జున్ విడుదల కావడంతో యావత్తు తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా ఆయన ఇంటికి తరలివచ్చి ఆయన్ను పరామర్శించింది.

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అరెస్ట్ గురించి నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..జైలులో ఎలా ఉంటుందో వివరించారు. జైలు లోపలికి వెళ్లే సమయంలో సమగ్రంగా చెక్ చేసిన తర్వాతే లోపలికి వెళ్తామని కస్తూరి శంకర్ వివరించారు. పుట్టినప్పుడు ఎలా ఉంటామో అలాగే చెక్ చేస్తారని ఆమె తెలిపింది. ఒంటి మీద నూలుపోగు లేకుండా చెక్ చేస్తారని చెప్పుకొచ్చింది. అయితే మహిళా ఖైదీలను చెక్ చేసేవాళ్లు లేడిస్ ఉంటారని ఈ భామ తెలిపింది.
Jail life Mari ila untundha🙏 pic.twitter.com/f6bk7Onh1W
— రాG 🌸 రెడ్డి గారి అమ్మాయి❣️ (@Nithya_pspk) December 22, 2024
అయితే నా ప్రైవేట్ పార్ట్స్‌లో ఏమైనా ఉన్నాయా అని చెక్ చేశారని కస్తూరి శంకర్ చెప్పారు. మూడుసార్లు గుంజీలు తీయిస్తారని చెప్పుకొచ్చారు. జైలులో కిందే పడుకోవాలని ఆమె తెలిపారు. అల్లు అర్జున్‌కు సైతం ఇదే జరిగి ఉంటుందని ఆమె తెలిపింది. అల్లు అర్జున్‌ను కూడా మొత్తం న్యూడ్‌గా ఉంచి చెక్ చేసి ఉంటారు అనుకున్నాను. అలాగే అతన్ని ఫొటో తీసి, నంబర్ కూడా ఇచ్చారనుకున్నాను. ఎందుకంటే నాకు అలాగే చేశారు కాబట్టి అతనికి కూడా అదే జరిగి ఉంటుంది. అసలు అక్కడ తప్పు చేశారా లేదా అని పట్టించుకోకుండా ప్రవర్తిస్తారని చెప్పుకొచ్చింది. రిమాండ్ ఖైదీ ఎవరికైనా ప్రాసెస్ ఇలాగే ఉంటుందని కస్తూరి శంకర్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications