ఛీటర్.. ఇప్పటికైనా మారు అంటూ హర్షసాయికి ఎక్స్ లవర్ కౌంటర్
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. వారిలో ఇన్‌ఫ్లూయెన్సర్లు, టీవీ నటులు, యూట్యూబర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే హర్షసాయి, విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, రీతు చౌదరి, టేస్టీ తేజ, అజయ్, కిరణ్ గౌడ్, బయ్యా సన్నీ యాదవ్, సుధీర్ రాజు వంటి వారిపై కేసు నమోదు అయ్యింది. అయితే ఇప్పుడు ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి కూడా ఈ లిస్టులో ఉండడంతో.. ఆయన మాజీ లవర్ సోషల్ మీడియా వేదికగా ఛీటర్ ఇప్పటికైనా మారు అంటూ ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ స్టోరీలో.. హర్ష సాయి పేరు ప్రస్తావించకుండానే ఓ పెద్ద మెసేజ్ రాసుకొచ్చింది ప్రముఖ నటి, బిగ్ బాస్ ఫేమ్ మిత్ర. ఆమె ఏం రాసింది అంటే.. హలో మిస్టర్ చీటర్.. మళ్ళీ బ్యాంకాక్ పారిపోయావ్ అని తెలిసింది. నువ్వు మమ్మల్ని మోసం చేసి మా జీవితాలను నాశనం చేశావు. ఇప్పుడు నిన్ను కర్మ వెంటాడుతుంది. ఇప్పటికైనా నా మాట విని మారిపో.. సొసైటీతో పాటు నీ ఫాలోవర్స్ కు సారీ చెప్పు. ఇకపై ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలని మాట ఇవ్వు. ఈరోజే బ్యాంకాక్ నుంచి బయలుదేరి వచ్చేయ్ అంటూ రాసుకొచ్చింది.

అంతే కాకుండా సజ్జనార్ సర్ మీ వల్ల చాలా కుటుంబాల భవిష్యత్తు బాగుంటుంది. నా అన్వేషణ చాలా గొప్ప పని చేశారంటూ స్టోరీ పెట్టింది. అయితే గతంలో మిత్ర శర్మను హర్ష సాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన వద్ద నుంచి రెండు కోట్ల వరకు డబ్బు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఇక ఇప్పుడు ఎక్కడ కూడా తన పేరు కూడా మెన్షన్ చేయకుండానే గట్టిగానే కౌంటర్ ఇచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారికి యాప్ నిర్వాహకుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వస్తున్నట్టు సమాచారం. కానీ ఆ యాప్స్ ద్వారా చాలా మంది ఆర్థికంగా నష్టపోయామని, సూసైడ్ చేసుకున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌ను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ యాప్స్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications