శ్రీలీలతో పోటీ లేదు.. నువ్వేం బాధపడకు బ్రదర్ అంటున్న నిధి అగర్వాల్..!
'నిధి అగర్వాల్ '.. సవ్యసాచి సినిమాలో నాగ చైతన్య సరసన నటించి తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ను యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. రామ్ పోతినేనితో "ఇస్మార్ట్ శంకర్" చిత్రం బ్లాక్‌బస్టర్ కావడంతో అమ్మడి దశ మారిపోయింది. పలు వరుస సినిమాల్లో నటించిన ఈమెకు తమిళ్‌లో అదిరిపోయే క్రేజ్ ఉంది. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ తన భారీ అందాలను ఆరబోస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది.
అయితే నిధి అగర్వాల్ తెలుగు తెరపై కనిపించి మూడేళ్లు అవుతోంది. 2022 సంక్రాంతి తర్వాత ఆమె నటించిన ఏ మూవీ ఇంకా రిలీజ్ కి నోచుకోలేదు. కానీ దాదాపు అప్పుడే ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల మాత్రం టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. అయితే ఈ విషయంపైనే ఓ నెటిజన్ సెటైర్ వేస్తూ కామెంట్ చేశాడు. 2019లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత ఏమి చేసింది? ఎన్ని సినిమాలు చేసింది? 2021లో వచ్చిన శ్రీలీలను చూడండి 20 సినిమాలకు పైగానే చేసింది అని పొస్త పెట్టాడు. అయితే ఆ ట్వీట్ కాస్త నిధి కంటపడడంతో ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.

ఆ ట్వీట్ కి రిప్లై ఇస్తూ.. ఇస్మార్ట్ శంకర్ తర్వాత 'హీరో' మూవీ చేసింది. తమిళంలో 3 సినిమాలు చేసింది. అలాగే 'హరి హర వీరమల్లు' సినిమాకు సైన్ చేసింది అంటూ పోస్ట్ పెట్టింది. అలానే తన దగ్గరకు వచ్చిన వాటిల్లో మంచి స్క్రిప్ట్‌లు అనుకున్న సినిమాలకే సైన్ చేస్తున్నానని.. దాని కోసమే టైమ్ తీసుకుంటున్నానని పేర్కొంది. కొన్నిసార్లు తన నిర్ణయం తప్పు అయి ఉండొచ్చు కానీ మంచి సినిమాల్లో భాగం కావాలనేది తన ఇంటెన్షన్ అంటూ చెప్పుకొచ్చింది. తనకేమి తొందర లేదని.. ఇండస్ట్రీలోనే ఉండిపోవాలని అనుకుంటున్నానని.. తన గురించి ఏం దిగులు పడొద్దంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
ప్రస్తుతం ఈ భామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. పాలిటిక్స్ కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మే 9న ఈ సినిమా పార్ట్ 1 ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు అనౌన్స్ చేశారు. అలానే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న రాజా సాబ్ సినిమాలో కూడా నటిస్తోంది. అంతే కాకుండా వెంకీ అట్లూరి - సూర్య కాంబినేషన్ లో రాబోతున్న మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు టాక్ నడుస్తోంది.
Ismart tarwata hero movie chesindi, 3 Tamil films chesindi AND hhvm film sign chesindi. I take my time and sign films that I feel are good scripts, sometimes I might be wrong but my intention is to be a part of good cinema. I’m in no hurry.. I’m here to stay brother don’t worry…
— Nidhhi Agerwal 🌟 Panchami (@AgerwalNidhhi) April 13, 2025












Click it and Unblock the Notifications