హీరో గర్ల్ ఫ్రెండ్ దెబ్బకు ఫోటోలు వైరల్, స్టార్ హీరో భార్య సైలెంట్, DP అంటే ఏమిటి అర్థం ?
స్యాండిల్ వుడ్ చాలెంజింగ్ స్టార్, డీ బాస్ దర్శన్ ఫ్యామిలీ మ్యాటర్ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి, ఆ హీరో గర్ల్ ఫ్రెండ్ పవిత్రా గౌడల వివాదంతో కొంతకాలంగా సోషల్ మీడియాలో రచ్చరచ్చ అయ్యింది. అయితే వారం రోజులుగా ప్రశాంతంగా ఉన్న హీరో దర్శన్ అభిమానులు మరోసారి షాక్ అయ్యారు. హీరో దర్శన్ గర్ల్ ఫ్రెండ్ పవిత్రా గౌడ మరి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో మరోసారి కలకలం రేపింది.
కొన్ని రోజుల క్రితం పవిత్రా గౌడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్‌తో కలిసి తీసుకున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానుతో పంచుకున్నారు. హీరో దర్శన్, పవిత్రా గౌడ కలిసి తీసుకున్న ఈ ఫోటోలు కలకలం సృష్టించాయి. అనంతరం ఈ ఫోటోలపై దర్శన్ భార్య విజయలక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి సోషల్ మీడియాలో దర్శన్ భార్య విజయలక్ష్మి, చాలెంజింగ్ హీరో గర్ల్ ఫ్రెండ్ పవిత్రా గౌడల మధ్య గొడవలు జరిగాయి.

నటి చేసి ఆ కామెంట్ తో హీరో భార్య ఫైర్: పవిత్ర గౌడ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చెయ్యడమేకాకుండా దర్శన్‌తో 10 సంవత్సరాల నా అనుబంధం చాలా సంతోషాన్ని ఇచ్చిందని, ఆ వేడుకలు జరుపుకున్నానని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీనిపై స్యాండిల్ వుడ్ హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి తన వ్యతిరేకతను వ్యక్తం చేయడంతో అది వివాదానికి దారితీసింది. ఆ తర్వాత పవిత్రా గౌడ ఆమె మొదటి వివాహం గురించి, ఆమె కుమార్తె గురించి విజయలక్ష్మి సోషల్ మీడియాలో సమాచారాన్ని పంచుకున్నందుకు పవిత్రా గౌడ మండిపడింది.
ఇదే సమయంలో పవిత్రా గౌడ ప్రైవేట్ ఫోటోలను విజయలక్ష్మి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరిపోయింది. తన ప్రైవేట్ ఫోటోలు నువ్వు ఎందుకు సోషల్ మీడియాలో పోస్టు చేశావు అంటూ విజయలక్ష్మి మీద దర్శన్ గర్ల్ ఫ్రెండ్ పవిత్రా గౌడ విరుచుకుపడింది. ఇంకోసారి ఇలా చేస్తే పరిస్థితులు వేరుంగా ఉంటాయని దర్శన్ భార్య విజయలక్ష్మిని నటి పవిత్రా గౌడ హెచ్చరించింది. తరువాత దర్శన్ భార్య విజయలక్ష్మి గానీ, పవిత్రగౌడ్ గానీ ఈ గొడవను కొనసాగించకుండా సైలెంట్ అయ్యారు.
అయితే నటి పవిత్రా గౌడ మాత్రం ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో తన దుస్తుల డిజైన్లు, పలు డ్రస్ ల కలెక్షన్‌ల గురించి వీడియోలను పంచుకుంటోంది. హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి మాత్రం సోషల్ మీడియాకు దూరంగా ఉండిపోయింది. ఇప్పుడు హీరో దర్శన్ తో ఉన్న ఫోటో, ఓ కెమెరాతో ఫోటోగ్రఫీ చేస్తున్న మరో రెండు ఫోటోలను నటి పవిత్రా గౌడ సోషల్ మీడియాలో మరోసారి షేర్ చెయ్యడంతో చాలెంజింగ్ స్టార్ దర్శన్ అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నటి పవిత్రా గౌడ షేర్ చేసిన ఫోటోలు చూసిన దర్శన్ అభిమానులు పలు కామెంట్లు చేస్తున్నారు.

మా బాస్ కు నువ్వు కరెక్ట్ జోడి వదిన ?
వదిన మీ చేతిపై ఉన్న టాటూ సూపర్ గా ఉంది అంటూ కొందరు చేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. నటి పవిత్రా గౌడ కెమెరా పట్టుకుని కెమెరాకు పోజులిచ్చారు. ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. భూమి ఒక కళ, దానికి ఏకైక సాక్ష్యం ఫోటోగ్రఫీ అని పవిత్రా గౌడ పోస్టు చేశారు. దర్శన్ గర్ల్ ఫ్రెండ్ పవిత్రా గౌడ ఈ ఫోటోలు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే దర్శన్ ఫోటోల గురించి, వాటి కింద ఉన్న పోస్టుల గురించి డీ బాస్ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఫోటోలను నటి పవిత్రా గౌడ షేర్ చేసిన కొద్ది గంటల్లోనే 24 వేల మందికి పైగా లైక్ చేసారు. దానికి తోడు కామెంట్ల వర్షం కురిపించారు. ఎప్పుడూ మమ్మల్ని నవ్వించే బాస్ కు నువ్వు సరైన జోడి అంటూ ఒకరు, వదినా మా బాస్ కు నువ్వు సూపర్ గా మ్యాచ్ అయ్యావు అని మరొక అభిమాని పోస్టు చేశారు. అయితే పవిత్రా గౌడ చేతిపై ఉన్న టాటూపై కొందరి అభిమానుల కళ్లుపడ్డాయి. అందరూ పవిత్రా గౌడ చేతి మీద ఉన్న టాటును చూడిండి అంటూ కొందరు అభిమానులు పోస్టు చేశారు. పవిత్రా గౌడ చేతి మీద డీ అండ్ పీ (D &P) అనే టాటూ చూడండి, డీ అంటూ డీ బాస్, పీ అంటే వదిన పవిత్రా అని అర్థం అని ఓ అభిమాని పోస్టు చెయ్యడంతో అది వైరల్ అయ్యింది.
మొత్తానికి పవిత్రా గౌడ దర్శన్ తో కలిసి దిగిన ఫొటోలను మరోసారి షేర్ చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోందనే మాట నిజం అని దర్శన్ అభిమానులు అంటున్నారు. పవిత్రా గౌడ వార్నింగ్ మెసేజ్ పంపడంతో దర్శన్ భార్య విజయలక్ష్మి ఎదురుదాడి చేస్తుందని అంతా అనుకున్నారు. అయితే దీనిపై విజయలక్ష్మి స్పందించలేదు. ఈ మధ్య కాలంలో హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించకుండా చాలా సైలెంట్ గా ఉండిపోయారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications