చిన్న వయస్సులోనే అతను నన్ను తల్లిని చేశాడు
తెలుగు ఇండస్ట్రీలో నటి ప్రగతికి ప్రత్యేక గుర్తింపు ఉంది. గత 20 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారామె. హీరోయిన్‌గా, హీరో, హీరోయిన్లకు తల్లిగా, పలు విభిన్న క్యారెక్టర్లలో కనిపించి మెప్పిచింది. సినిమాల్లో నటించిన రాని గుర్తింపు సోషల్ మీడియా ద్వారా ప్రగతికి వచ్చిందనే చెప్పాలి. సోషల్ మీడియాలో నటి ప్రగతికి మంచి క్రేజ్ ఉంది. ప్రగతి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు.
ఎప్పటికప్పుడు తన సినిమాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా పోస్టు చేస్తుంటుంది. ముఖ్యంగా తన హాట్ ఫొటోలతో పాటు, జిమ్‌లో తాను కష్టపడుతున్నా వీడియోలను అభిమానుల కోసం షేర్ చేస్తోంది. స్పోర్ట్స్ డ్రెస్‌లో జిమ్ చేస్తూ కనిపించే ప్రగతి..ఆ మధ్య చీరలో జిమ్ చేసి అందరికి షాకిచ్చింది. 50 ఏళ్ల వయస్సులో కూడా ఫుల్ గ్లామర్‌గా కనిపించి అభిమానులను అలరిస్తుంది.

తన రెండో పెళ్లి పై వస్తున్న వార్తలపై కూడా నటి ప్రగతి క్లారిటీ ఇచ్చారు. తాను పెళ్లి చేసుకుంటే మీడియాకే ముందే చెబుతానని ఆమె తెలిపారు. తాజాగా ప్రగతి ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన కెరీర్‌లో ఎదురైన అనుభవాలు గురించి తెలిపింది.
కెరీర్ స్టార్టింగ్‌లో కేవలం హీరోయిన్ పాత్రలే చేయాలని అనుకున్నానని..అలా చాలాకాలం వేచి చూసినప్పటికీ సరైన అవకాశాలు రాకపోవడంతో...తన మంచి కోరుకునే ఓ వ్యక్తి...ఏ క్యారెక్టర్ వచ్చినా చేయమని..సలహా ఇచ్చారని..అప్పటి నుంచి వచ్చిన ప్రతి ఆఫర్‌లో నటించానని.. అలా తాను చిన్న వయస్సులోనే తల్లినైయ్యానంటూ ప్రగతి తెలిపారు. బహుశ హీరోయిన్‌గా చేసి ఉంటే ఇండస్ట్రీలో ఇన్నాళ్లు కొనసాగేదాన్ని కాదంటూ ఆమె చెప్పుకొచ్చారు. ప్రగతి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.












Click it and Unblock the Notifications