మద్యం మత్తులో నటి రమ్యకృష్ణ..?

నటి రమ్యకృష్ణ ఇటీవల కాలంలో తరుచు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఆమె తన సినిమా విశేషాలతో వార్తల్లో నిలిస్తే .. ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు. కాని ఆమె వరుస వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలుస్తున్నారు. టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మంత్రి రోజాపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నటి రమ్యకృష్ణ ఖండించారు. బండారు సత్యనారాయణ చేసిన కామెంట్స్‌కు రమ్యకృష్ణ కౌంటరిచ్చారు. సమాజంలో మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారామె.

రోజాకు మద్దతుగా నిలవడంతో.. టీడీపీ క్యాడర్ రమ్యకృష్ణను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.గతంలో చైన్నైలో మద్యం బ్యాన్ ఉన్న సమయంలో రమ్యకృష్ణ కారులో భారీ ఎత్తున మద్యం సీసాలు దొరికాయి. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా సృష్టించింది. ఆ పాత వీడియోను టీడీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తూ రమ్యకృష్ణను ట్రోల్ చేశారు.

Actress ramya krishna romantic photo went viral on social media

ఈ ఘటన మరువక ముందే మరో వివాదంలో రమ్యకృష్ణ చిక్కుకున్నారు. ఇటీవలే రమ్యకృష్ణ పుట్టిన రోజు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రమ్యకృష్ణ క్లోజ్ ఫ్రెండ్స్ హాజరైయ్యారు. నటి రాధిక రమ్యకృష్ణకు పుట్టిన రోజు శుభకాంక్షాలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేశారు. అయితే ఈ ఫొటో బ్యాక్ గ్రౌండ్‌‌ను ఓసారి నిశితంగా పరిశీలిస్తే..అది పబ్‌ అని స్పష్టంగా తెలుస్తుంది.

అంతేకాకుండా రమ్యకృష్ణ చేతిలో మందు గ్లాస్ ఉన్నట్టు ఈ ఫొటో చూసిన వారికి ఇట్టే అర్థం అవుతుంది. బర్త్ డే సెలబ్రేషన్స్‌ను ఇద్దరూ బాగా ఎంజాయ్ చేసినట్టుగానే కనిపిస్తున్నారు.రమ్యకృష్ణను గట్టిగా హత్తుకున్న రాధిక ఆమె బుగ్గలపై ముద్దులిస్తూ.. ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి దీనిపై నెటిజన్లు ఎలా స్పందిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+