పెళ్లి ఎప్పుడో చెప్పేసిన స్టార్ బ్యూటీ శ్రీలీల.. అతనితోనే !

తెలుగు చిత్ర పరిశ్రమలోకి "పెళ్లి సందD" సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది నటి శ్రీలీల. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన గ్లామర్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, డాన్స్ స్కిల్స్‌తో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన "ధమాకా" సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి.. ఆమెకు మాస్ ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. దాంతో స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.

కాగా హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా శ్రీలీల కెరీర్ ఫుల్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఆమె ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ అవకాశాలు అందుకుంటోంది. పుష్ప 2లోని "కిస్సిక్" అనే ఐటమ్ సాంగ్‌లో ఆమె చేసిన స్టెప్పులు, ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ పాట సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ సాధించింది.

actress-sreeleela-shocking-comments-on-her-marriage

ప్రస్తుతం శ్రీలీల బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. మూవీ షూటింగ్ సమయంలో వీరి మధ్య సన్నిహితత పెరగడంతో, వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియా హల్‌చల్ చేస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై శ్రీలీల కానీ కార్తీక్ కానీ స్పందించలేదు.

పెళ్లి అప్పుడే..

రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీలీల మాట్లాడుతూ.. ప్రస్తుతం తనకు 24 ఏళ్లే అని, 30 ఏళ్లు వచ్చేంత వరకూ పెళ్లి గురించి ఆలోచించాలి అని అనుకోవట్లేదని తెలిపింది. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని.. ప్రైవేట్ లైఫ్ గురించి ఆలోచించేందుకు సమయం లేదని వెల్లడించింది. నిజంగా ప్రేమలో ఉంటే... అమ్మ నాతో ఎందుకు ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. తనకు ప్రస్తుతం పెద్ద సినిమాలు వస్తున్నాయని.. ప్రేక్షకుల ఆశీర్వాదంతో అన్ని భాషల చిత్రాల్లో కొనసాగాలని ఆశపడుతున్నట్టు స్పష్టం చేసింది.

ఇక శ్రీలీల నటించిన తాజా చిత్రం 'జూనియర్', కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరిటీ రెడ్డి హీరోగా పరిచయం అయిన సినిమా. సాయి కొర్రపాటి నిర్మాణంలో, రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో జెనీలియా కూడా కీలక పాత్రలో నటించింది. జూలై 18, 2025న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ఇందులోని 'వైరల్ వయ్యారి' సాంగ్ ఇప్పటికే సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ప్రస్తుతం శ్రీలీల రవితేజతో "మాస్ జాతర", పవన్ కళ్యాణ్‌తో "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమాల్లో నటిస్తోంది. రెండూ భారీ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ కావడం విశేషం. ఇవి విడుదలైతే శ్రీలీలకు మళ్లీ భారీ ఆఫర్లు అ ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+