ఓటు వేసి మరీ ఆ యాంగిల్ చూపించిన శ్రీరెడ్డి
నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉందని మొట్ట మొదటిసారి ధైర్యంగా చెప్పిన నటి శ్రీరెడ్డి. సినిమాల్లో ఆఫర్లు ఇస్తామని చెప్పి పలువురు మహిళలను లైంగికంగా వాడుకుంటున్నారని ఆమె ఆరోపించింది. దీనిపై ఆమె కొన్ని సాక్ష్యాలను కూడా బయటపెట్టడం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఇక తర్వాత శ్రీరెడ్డి సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీని పెంచుకుంది.
మనల్నెవడ్రా ఆపేది ??నా ఓట్ ఫ్యాన్ కి కి వేసా..Jai jagan pic.twitter.com/QPa8AKGjUl
— Sri Reddy (@SriReddyTalks) May 13, 2024
తెలుగు ఇండస్ట్రీపై తనదైనశైలిలో విమర్శలు చేస్తూ నిత్యం వివాదాల్లో నిలుస్తోంది. రాజకీయ విమర్శలు చేయడానికి కూడా శ్రీరెడ్డి ఏమాత్రం మొహటపడదనే విషయం అందిరికి తెలిసిందే. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబులపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుంటుంది. ఆమె ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి మద్దతుగా ఎన్నో వీడియోలు చేసింది. తాజాగా సోమవారం జరిగిన పోలింగ్‌లో శ్రీరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకుంది.

దీనికి సంబంధించిన ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోకు అదిరిపోయే క్యాప్షన్‌ను జత చేసింది. మనల్నెవడ్రా ఆపేది? నా ఓట్ ఫ్యాన్ కే వేసా.. జై జగన్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇందులో శ్రీరెడ్డి శారీ కట్టుకుని నిండైన దుస్తుల్లో కనిపించడంతో సోషల్ మీడియా వేదికన పలువురు జనాలు శ్రీరెడ్డిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం శ్రీరెడ్డి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications