ఎన్నికల కౌంటింగ్ వేళ త్రిష షాకింగ్ పని.. వీడియో వైరల్ !!!
దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా అగ్రస్థానంలో నిలిచిన అందాల భామ "త్రిష". తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్‌లో దాదాపు అన్ని స్టార్ హీరోల సరసన నటించిన ఈమె తన నటనతో పాటు అందంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒక దశలో ఇండస్ట్రీలో అత్యధికంగా డిమాండ్ ఉన్న హీరోయిన్‌గా కొనసాగింది. ఆ మధ్య కొంత విరామం తీసుకున్న త్రిష, సెకండ్ ఇన్నింగ్స్‌లో మరింత ఉత్సాహంతో తిరిగి ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా Ponniyin Selvan సినిమా ద్వారా ఆమెకు మళ్లీ భారీ క్రేజ్ వచ్చింది. అయితే ఆ తర్వాత వచ్చిన 'థగ్ లైఫ్', 'ఐడెంటిటీ', 'విదాయమర్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి.
ఇక ఇటీవల త్రిష తన సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో Vijayతో ఆమె రిలేషన్‌పై వస్తున్న వార్తలు కోలీవుడ్‌లో పెద్ద చర్చకు దారి తీసాయి. అదే సమయంలో విజయ్ భార్య Sangeetha Sornalingam విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం మరింత రచ్చగా మారింది. మరో నటితో విజయ్ సన్నిహితంగా ఉంటున్నారనే ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలోనే ఇటీవల విజయ్, త్రిష కలిసి ఒక వివాహ వేడుకకు హాజరైన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ఈ విషయాన్ని మరింత హీట్ ఎక్కించాయి.

ఒకే రోజు త్రిష బర్త్‌డే & ఎలక్షన్ రిజల్ట్స్..
కాగా ఒక వైపు తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నడుస్తోంది. మరోవైపు ఇదే రోజు త్రిష పుట్టినరోజు కూడా కావడం గమనార్హం. ఒకవేళ విజయ్ తమిళనాడు ఎలక్షన్స్ లో తన టీవీకే పార్టీతో అధికారంలోకి వస్తే మాత్రం ఆయనకు డబుల్ ధమాకా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అటు త్రిష బర్త్ డే..మరోవైపు ఎలక్షన్ విన్నింగ్ .. రెండు మర్చిపోలేని అనుభూతులుగా మిగిలిపోతాయని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ అనూహ్య పరిణామాల్లో త్రిష చేసిన పని ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. కొందరు విజయ్ గెలుపు కోసం అంటూ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం పుట్టిన రోజు సందర్భంగా వచ్చారు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు త్రిష ఇప్పటికే విజయ్ tvk పార్టీకి మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే.
Actor Trisha offers prayers at Tirumala temple ahead of counting. pic.twitter.com/wAI4WURQJS
— News Arena India (@NewsArenaIndia) May 4, 2026












Click it and Unblock the Notifications