బస్సులో అందరూ ఉండగానే అక్కడ పట్టుకున్నాడు - తెలుగు నటి
"అదితి మ్యాకల్"... విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన "అర్జున్ రెడ్డి" సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది. చిన్న పాత్ర అయినప్పటికీ తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ తెలుగు అమ్మాయి.. గ్లామర్‌తో పాటు టాలెంట్‌తో ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటోంది. అయితే లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బస్సు ఎక్కినప్పుడు ఓ వ్యక్తి తన ఛాతీని తాకాడని చెప్పుకొచ్చారు. దీంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఈ మేరకు అదితీ మాట్లాడుతూ..
రీసెంట్ గా నటుడు శివాజీ మహిళల బట్టల గురించి చేసిన కామెంట్స్ ఎంత రచ్చకు దారి తీసాయో తెలిసిందే. ఈ క్రమంలోనే డ్రెస్ స్టైల్‌పై అదితి ఘాటుగా స్పందించింది. మీ మూవీస్ లోనే హీరోయిన్స్ అలాంటి బట్టలు వేసుకున్నారు. అప్పుడెందుకు వాళ్లని ఆపలేదు అని వ్యాఖ్యానించారు. అలాంటి బట్టలు వేసుకోవడం తన ఇష్టమని.. తనకు FOOD పెడుతోందని తెలిపారు. అలా అని తాను BIKINI రోడ్ మీద వేసుకొని వెళ్లట్లేదు కదా అని చెప్పుకొచ్చారు. మహిళల దుస్తులే సమస్య అయితే తాను గతంలో ఫుల్ డ్రెస్ వేసుకొని బస్సు ఎక్కినప్పుడు ఓ వ్యక్తి తన ఛాతీని తాకాడని వివరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.

కుటుంబ నేపథ్యం..
అదితి మ్యాకల్ తెలంగాణలోని కామారెడ్డిలో జన్మించింది. ఆమె తండ్రి సదాశివపేట ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపల్‌గా పనిచేశారు. చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి పెంచుకున్న అదితి, కూచిపూడి నృత్యం నేర్చుకుని పలు వేదికలపై ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు అందుకుంది. చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ఆమె వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరిచింది. హైదరాబాద్‌లోని నిఫ్ట్ కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసిన అదితి మొదట డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించింది. ఫ్యాషన్‌పై ఉన్న మక్కువతో తన డిజైన్స్‌ను తానే ధరించి పలు ఫ్యాషన్ షోలలో పాల్గొంది. ఈ క్రమంలో డిజైనర్ కంటే మోడల్‌గా ఎక్కువ గుర్తింపు రావడంతో మోడలింగ్ వైపు అడుగులు వేసింది.
వెబ్‌సిరీస్‌ల నుంచి సినిమాలకు..
యూట్యూబ్ వెబ్‌సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నటన ప్రారంభించిన అదితి, 'పాప పి సుశీల', 'ముద్దపప్పు ఆవకాయ్', 'పాష్ పోరీస్' వంటి ప్రాజెక్టులతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత Ami Thumi, Radha, Mithai, Nenu Leni Na Premakatha వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. చిన్న పాత్రలే అయినప్పటికీ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రీసెంట్ గానే Ekam సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే Sobhita Dhulipala నటించిన చీకట్లో చిత్రంలో కూడా కనిపించి తన నటనతో మంచి స్పందన పొందింది.
-
టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి డేట్ ఫిక్స్.. అందరిలాగా కాకుండా కొత్తగా !! -
అన్నదమ్ముల డబుల్ బొనాంజా.. మొన్న సంతోష్.. ఇప్పుడు సంగీత్ !! -
రణ్‌బీర్ - సాయి పల్లవి "రామాయణ" టీజర్లో ఈ తప్పులను గమనించారా? -
విడాకులు తీసుకుంటున్న శర్వానంద్?.. సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు డిలిట్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడు అతనే ?? -
పెళ్లయిన నెల రోజులకే రష్మిక గుడ్ న్యూస్..? ముగ్గురం అయ్యామంటూ పోస్ట్ వైరల్.. -
మధ్యతరగతి మనుషుల ఎమోషనల్ జర్నీ -
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా












Click it and Unblock the Notifications