బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడు అతనే ??

బండ్ల గణేష్.. తెలుగు ప్రేక్షకులకు ఈయన గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కమెడియన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. రవితేజ నటించిన ఆంజనేయులు మూవీతో నిర్మాతగా మారగా.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసి హిట్స్ అందుకున్నారు. స్టార్ ప్రొడ్యూసర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. 2015లో వచ్చిన 'టెంపర్' చిత్రం తర్వాత సినీ నిర్మాణ రంగానికి దూరంగా ఉన్నారు.

ఇప్పుడు లేటెస్ట్ గా బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె జనని పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ మేరకు శుభకార్యానికి సంబంధించి 'పసుపు కుంకుమ' కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఆ పోస్టులో.. "శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు.. ఆ దేవుడి ఆశీస్సులు, మా పెద్దల దీవెనలతో త్వరలో మా ఇంట్లో జరగబోయే శుభకార్యం. చిరంజీవి 'సూర్యతేజ చిలుకూరి' మరియు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి 'జనని బండ్ల'ల వివాహ సందర్భంగా పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహించాం" అని బండ్ల గణేష్ పేర్కొన్నారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.

tollywood-producer-bandla-ganesh-daughter-janani-marriage-news-got-viral-on-social-media

కాగా కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో కమెడియన్ గా, సహాయక నటుడిగా మెప్పించారు గణేష్. సూర్య వంశం, సుస్వాగతం, సాంబయ్య, మనసులో మాట, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, ఆంధ్రావాలా, పోకిరి, 143 వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అలానే ఆ తర్వాత నిర్మాతగా మారి పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ను స్థాపించారు. ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, టెంపర్, బాద్ షా, ఇద్దరమ్మాయిలతో, గోవిందుడు అందరి వాడేలే సినిమాలు నిర్మించారు.

మరోవైపు రీసెంట్ గానే "BG Blockbusters" అనే కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్ ద్వారా కేవలం కమర్షియల్ చిత్రాలే కాకుండా.. మనసుకు హత్తుకునే కథలు, కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తామని స్పష్టం చేశారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడానికి కూడా ప్రాధాన్యత ఇస్తానని ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ బ్యానర్ పై ఒక ప్రాజెక్ట్ ఖరారైందని.. దానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తానని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+