OTT MOVIE: చరిత్ర సృష్టిస్తున్న క్రైమ్ థ్రిల్లర్.. ట్విస్టులే ట్విస్టులు

కొవిడ్ లాక్ డౌన్ పుణ్యమా అని ఓటీటీలు ప్రేక్షకులకు విపరీతంగా అలవాటు అయిపోయాయి. కరోనా కారణంగా లాక్ డౌన్ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో థియేటర్స్ బంద్ కావడంతో ఓటీటీలు పుట్టుకొచ్చాయి. ఇక ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ కు హద్దే లేకుండా పోయింది. ఇక ఓటీటీల్లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ఓ మూవీ ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఆ సినిమానే 'అడాల్‌సెన్స్‌'ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ 'నెట్‌ఫ్లిక్స్‌'లో తెలుగులోనూ స్ట్రీమింగ్‌ అవుతోందీ ఈ మినీ సిరీస్‌. సామాన్య తల్లిదండ్రుల నుంచి దేశాధినేతల వరకూ ఈ సిరీస్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'నా ఇద్దరు పిల్లలతో కలిసి 'అడాల్‌సెన్స్‌' చూశానని సాక్షాత్తూ బ్రిటన్‌ ప్రధాని కీర్ స్టార్మర్ ఇటీవల వెల్లడించారు.

కథేంటి..?

క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కింది. 'అడాల్‌సెన్స్‌' అంటే 13 నుంచి 19 ఏళ్ల వయసున్న పిల్లలు అని అర్థం. యుక్త వయసు లేదా కౌమారదశ అనే అర్థం కూడా వస్తుంది. స్టీఫెన్ గ్రాహం కథ అందించి, నటించిన ఈ మినీ సిరీస్‌కు ఫిలిప్ బరంతిని దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో ఓవెన్ కూపర్, స్టీఫెన్ గ్రాహం, ఎరిన్ డొహెర్టీ, అష్లీ వాల్టర్స్, ఫయె మార్సే, క్రిస్టిన్ ట్రేమార్కో ఇతరులు కీలక పాత్రల్లో మెరిశారు.

Adolescence The Crime Thriller Taking OTT by Storm with Record Views

'అడాల్‌సెన్స్‌' కథ ఒక 13 ఏళ్ల జేమీ మిల్లర్ అనే అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. తన గర్ల్ క్లాస్‌మేట్‌ను మర్డర్ చేసినట్లుగా కేసులో నిందితుడిగా 13 ఏళ్ల జేమీని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తారు. రిమాండ్ ఖైదీగా ఉన్న జేమీ నుంచి ఈ ఇన్వెస్టిగేషన్‌లో నిజాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే ఒక ప్రఫొషెనల్ సైకియార్టిస్ట్ హెల్ప్ తీసుకుంటారు. అప్పుడు ఆయన చేసిన విచారణలో జేమీ ఎలాంటి వాస్తవాలు బయటపెట్టాడనేదే ఈ సిరీస్ కథ.

Take a Poll

సుమారు గంట పాటు రన్ టైమ్‌ నిడివితో మొత్తం నాలుగు ఎపిసోడ్స్ ఉన్నాయి. 'అడాల్‌సెన్స్‌' నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన తొలి రోజు నుంచే ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ 1 వెబ్ సిరీస్‌గా చోటు సంపాదించుకుంది. ఈ సిరీస్ తొలివారంలో దాదాపుగా 20 మిలియన్‌కుపైగా వ్యూస్ దక్కించుకుంది. 11 రోజుల్లో 66.3 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ క్రైమ్ థ్రిల్లర్ ను చూసేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+