జీవితంలో నాకేది ఎక్కువ కాదు..ఐశ్వర్యరాయ్‌ సంచల కామెంట్స్

బాలీవుడ్ స్టార్ కపూల్ అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్న సంగతి అందరికి తెలిసిందే. 2007లో ఐశ్వర్యరాయ్,అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. 16 ఏళ్లు బాగానే సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

తాము కలిసే ఉన్నామని విడాకులు తీసుకోవడం లేదని ఐశ్వర్యరాయ్ క్లారిటీ ఇస్తూ ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసినప్పటికి ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. అంబానీ ఇంట జరిగిన పెళ్లి సమయంలో కూడా అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ విడాకుల ప్రస్తావన తెర మీదకు వచ్చింది. ఫొటో సెషన్‌లో భాగంగా బచ్చన్ ఫ్యామిలీతో కాకుండా ఐశ్వర్యరాయ్ ఒక్కరే ఫొటోలు దిగడంతో మరోసారి ఈ జంట విడాకుల గురించి చర్చ నడిచింది. ఈ ఘటన తర్వాత ఐశ్వర్యరాయ్ కూతురుతో కలిసి ఒంటిరిగా విదేశాలకు వెళ్లడంతో మరోసారి అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ విడాకులు తెర మీదకు వచ్చాయి.

Aishwarya Rai about her daughter aaradhya

ఇటీవల వీరిద్దరు కలిసున్న వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. కూతురిలో వీరిద్దరు దుబాయ్ వెకేషన్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి బస్సు ఎక్కుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోతో విడాకుల రూమర్లకు ఈ జంట చెక్ పెట్టినట్టు అయింది. అయితే తాజాగా ఐశ్వర్యరాయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఆరాధ్య పుట్టిన తర్వాత తన జీవితం పూర్తి మారిపోయిందని ఐశ్వర్యరాయ్ చెప్పుకొచ్చింది.

తాను అభిషేక్ ఎల్లప్పుడూ ఆరాధ్య జీవితాన్ని ఆరోగ్యంగా, సాధారణం చేయడానికి ప్రయత్నిస్తామని ఐశ్వర్యరాయ్ పేర్కొన్నారు. బచ్చన్ ఫ్యామిలీకి ఉన్న భారీ ప్రతిష్ట ఆరాధ్యపై పెద్దగా ప్రభావం చూపలేదుపడిపోయింది. ఆరాధ్య ఇంట్లో పాడుతుంది, డ్యాన్స్ చేస్తుంది.. కొన్నిసార్లు నా సినిమా పాటలపై, కొన్నిసార్లు తన తండ్రి , తాతయ్యల సినిమా పాటలతో డ్యాన్స్ చేస్తుందని ఐశ్వర్యరాయ్ తెలిపింది. మాది సాధారణ కుటుంబం. మేము ఆరాధ్య చుట్టూ ఉన్న వాతావరణాన్ని వీలైనంత సాధారణంగా ఉంచడానికి ప్రయత్నిస్తామని ఆ ఇంటర్వూలో తెలిపింది.జీవితంలో ఆమె తర్వాతే మిగిలినవి అన్నట్లుగా మారిపోయిందని ఐశ్వర్యరాయ్ చెప్పుకొచ్చింది. కూతురు ఆరాధ్య గురించి ఐశ్వర్యరాయ్‌ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+