విడాకులు ఖాయమైన ఐశ్వర్యరాయ్-అభిషేక్‌బచ్చన్?.. కొత్త కోడలికి అమితాబ్ లేఖ
కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియాతో నానుతున్న వార్త ఏదన్నా ఉందా? అంటే.. ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్ విడాకుల గురించే. కొన్నాళ్లుగా వీరు కలిసి కాకుండా విడివిడిగా కనిపిస్తుండటం, అనంత్ అంబానీ వివాహ వేడుకకు కూడా విడివిడిగా హాజరుకావడం, తదనంతర పరిణామాలన్నీ వీరి విడాకులు ఖాయమని తేల్చాయి. అందుకు కారణం ఏమిటనేది ఇటీవలే బయటకు వచ్చింది. కొన్నాళ్ల క్రితం తనతోపాటు ఓ సినిమాలో నటించిన నటి నిమ్రత్ కౌర్ తో అభిషేక్ బచ్చన్ ప్రేమాయణం నడుపుతుండటమే దీనికి కారణమని తేలింది.
నిమ్రతపై అమితాబ్ ప్రశంసలు
సరిగ్గా ఇటువంటి సమయంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నిమ్రత్ కౌర్ ను ప్రశంసిస్తూ సొంత దస్తూరితో లేఖ రాశారు. ఈ లేఖలో నిమ్రత్ పై ప్రశంసలు కురిపించారు. దీన్నిబట్టి అమితాబ్ కుటుంబం నిమ్రత్ ను అంగీకరించినట్లేనని, అభిషేక్-ఐశ్వర్య విడాకులు ఖాయమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమితాబ్ రాసిన లేఖలో ఏముందంటే.. దస్వి సినిమాలో నిమ్రత్ నటన అద్భుతంగా ఉందని, పలికించిన హావభావాలు, కనపరిచిన నటన.. ఇలా అన్నీ చాలా బాగున్నాయని ప్రశంసించారు. క్యాడ్ బరీ వాణిజ్య ప్రకటన చేసే సమయంలో యష్‌రాజ్ ఫిల్మ్స్‌లో నిమ్రత్ కు కాంప్లిమెంట్ ఇచ్చానని చెప్పారు.

పంపిన లేఖ దాచుకుంటాను
బిగ్ బి అమితాబ్ రాసిన లేఖపై నిమ్రత్ కౌర్ సోషల్ మీడియాలో స్పందించింది. ముంబయిలో 18 సంవత్సరాల క్రితం సెట్ లో తొలిసారిగా అడుగుపెట్టానని, అమితాబ్ బచ్చన్ గారికి ఓరోజు తన పేరు తెలుస్తుందని, ఆయన్ని కలవాలని చాలా కోరుకున్నానని, వాణిజ్య ప్రకటనలో నటించిన తర్వాత బిగ్ బి తన నటనపై ప్రశంసలు కురిపించారని చెప్పింది. తనను కొనియాడుతూ పూలు, పండ్లు పంపించారని, ప్రతిక్షణం, అనునిత్యం సినీ పరిశ్రమలోకి వచ్చేవారికి అమితాబ్ బచ్చన్ ఎంతో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని, అటువంటివారిని స్ఫూర్తిగా తీసుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని నిమ్రత్ అంది. అమితాబ్ పంపించిన ఉత్తరం కూడా తనకు ప్రత్యేకమైందని, జీవితకాలం దాచుకుంటానంది. అమితాబ్ లేఖ రాయడం, దానికి నిమ్రత్ స్పందించడాన్ని బట్టి అభిషేక్-ఐశ్వర్య విడాకులు ఖాయమేనని తేలుతోందని, కొత్త కోడలిని బిగ్ బి బాగా ప్రశంసించారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications