ఐశ్వర్య రాయ్‌ను పిచ్చి ప్రశ్న అడిగిన యాంకర్..ఓ రేంజ్‌లో చెడుగుడు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1994లో జరిగిన ప్రపంచ సుందరి పోటీల్లో ఐశ్వర్య రాయ్ విజేతగా నిలిచారు. ఆ తర్వాత తన సినిమా ఇండస్ట్రీ వైపు ఆమె అడుగులు వేశారు. 1997లో మణిరత్నం దర్శకత్వంలో తమిళ‌లో ఇరువర్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు ఐశ్వర్య. ఈ సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేశారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారామె.

బాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నారామె. ఇక ఇదే సమయంలో పలువురు హీరోలతో ఐశ్వర్య ప్రేమయాణం సాగించింది. తొలుత వివేక్ ఓబెరాయ్‌తో ఎఫైర్ నడిపిన ఐశ్వర్య ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పి సల్మాన్ ఖాన్‌‌తో కొన్నాళ్లు రిలేషన్‌ కొనసాగించింది. వీరిద్దరి మధ్య అభిప్రాయహభేదాలు తలెత్తడంతో అతని నుంచి విడిపోయింది. కొన్నాళ్లకు అభిషేక్ బచ్చన్‌తో ప్రేమలో పడి అతన్ని వివాహం చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఐశ్వర్య రాయ్ సదరు యాంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

aishwarya rai fire on anchor about question

యాంకర్ మాట్లాడుతూ..మీరు హాలీవుడ్‌కు వెళ్తునారని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మీరు నిజంగానే హాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారా అంటూ ఐశ్వర్య రాయ్‌ను యాంకర్ ప్రశ్నించారు. అవునా నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పానో దానికి సంబంధించిన వీడియో చూపించిన తర్వాతే మాట్లాడదాం అంటూ ఆ యాంకర్‌పై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నలు అడగండి కానీ నేను ఏదో చెప్పినట్లు స్టేట్‌మెంట్లు ఇవ్వొద్దు. తమిళ్, బెంగాలీ, హిందీ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నాను.

అలాగే ఇంగ్లీష్‌లోనూ నటిస్తున్నా అలా అని హాలీవుడ్‌కు వెళ్లిపోతాను అనుకోవడం కరెక్ట్ కాదంటూ ఫైర్ అయింది. అయితే ఐశ్యర్య గతంలో చేసిన ఈ కామెంట్స్ మరోసారి నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఐశ్వర్య రాయ్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్‌ విడాకులు తీసుకుంటున్నారని బాలీవుడ్ మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి. దీనిపై అభిషేక్ మాట్లాడుతూ..మా విడాకులు నిజమే.. ఈ విషయం చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. మరి ఆ తర్వాత మేము చేసుకోబోయే పెళ్లి గురించి కూడా మీరే చెప్పండంటూ కాస్తా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. దీంతో విడాకుల వార్తలకు చెక్ పడినట్లు అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+