పెళ్లికి ముందే మగబిడ్డకు జన్మనిచ్చిన ఐశ్వర్యరాయ్?
మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. తన అందంతోపాటు నటనతో కూడా అభిమానుల మనసులను గెలుచుకుంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ తయుడు అభిషేక్ బచ్చన్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. వీరి ప్రేమకు గుర్తుగా వీరికి ఆరాధ్య అనే కుమార్తె జన్మించింది. ప్రస్తుతం ఈ పాపను ఐశ్వర్య ఫ్యాషన్ ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఫ్యాషన్ షో ఎక్కడ జరిగినా తనతోపాటు తన కుమార్తెను కూడా వెంటపెట్టుకొని తీసుకువెళుతోంది. ఇటీవలే అబుదాబిలో జరిగిన ఐఫా వేడుకల్లో పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటనకు బాలకృష్ణ చేతులమీదుగా ఉత్తమ నటి అవార్డును అందుకుంది.
స్పందించని అభిషేక్, ఐశ్వర్య
కొన్ని నెలల నుంచి ఐశ్వర్యారాయ్ - అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకున్నారంటూ వార్తలు పుంఖాను పుంఖలుగా వస్తున్నాయి. అందరూ నిజమే అనుకుంటున్నప్పటికీ ఈ వార్తలపై వారిద్దరూ ఏనాడూ స్పందించలేదు. దీంతో అందరూ సైలెంటయ్యారు. తిరిగి మళ్లీ విడాకులపై వార్తలు వస్తున్నాయి. ఓ హీరోయిన్ తో అభిషేక్ బచ్చన్ స్నేహంగా ఉండటంవల్లే విడాకులు తీసుకోబోతున్నారని, అదే కారణమని ఆ వార్తల సారాంశం. తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. ఐశ్వర్యారాయ్ కు వివాహానికి ముందే కొడుకు ఉన్నాడనేది సంచలనంగా మారింది.

లండన్ నుంచి విశాఖపట్నం తీసుకువచ్చారు
సంగీత్ కుమార్ అనే వ్యక్తి తాను ఐశ్వర్యారాయ్ కొడుకునని, లండన్ లో ఐవీఎఫ్ ద్వారా జన్మించినట్లు తెలిపాడు. ఐశ్వర్యాయ్ తల్లిదండ్రులు తనను పెంచారని, తన జన్మకు సంబంధించిన అన్నిఆధారాలను వారు ధ్వంసం చేశారని, తనదగ్గర ప్రస్తుతం ఇప్పుడు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని సంగీత్ కుమార్ చెబుతున్నాడు. లండన్ లో జన్మించిన తనను ఐశ్వర్య తల్లిదండ్రులు విశాఖపట్నం తీసుకువచ్చారని చెప్పాడు. ఆధారాలు లేవని చెప్పడం మాత్రం సంచలనం కలిగిస్తోంది. సంగీత్ కుమార్ మానసిక పరిస్థితి సరిగా లేదని తేలడంతో అందరూ హమ్మయ్య అనుకున్నారు. ప్రస్తుతం సంగీత్ కుమార్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications