కింగ్.. స్టైల్, స్వాగ్ అండ్ ఛరిష్మా: తగులబెట్టేస్తాడు: రిలీజ్ డేట్ లాక్
నేడు.. అక్కినేని అందగాడు నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తోన్న 100వ చిత్రం గ్లింప్లెస్ విడుదల అయ్యాయి. రిలీజ్ డేట్ కూడా లాక్ అయింది. నాగ్ నటిస్తోన్న 100వ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. బర్త్ డేను పురస్కరించుకుని సినిమా టైటిల్ గ్లింప్స్‌ను చిత్రం యూనిట్ విడుదల చేసింది.
ఈ మూవీ డిసెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఎన్నో ఉన్నాయి. సీనియర్ నటి టబు ఇందులో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. గతంలో నాగార్జున, టబు కాంబినేషన్‌లో వచ్చిన నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు వెండితెరపై సృష్టించిన సంచలనం తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత ఈ హిట్ పెయిర్ మళ్లీ ఒకే స్క్రీన్‌ను పంచుకుంటోన్నారు.

ప్రధానంగా ఇద్దరు ఆప్తమిత్రుల మధ్య నడిచే భావోద్వేగాల చుట్టూ తిరుగుతుందీ ఫిల్మ్. ఈ చిత్రంలో నాగార్జునకు స్నేహితుడిగా తమిళ నటుడు రవీంద్ర విజయ్ నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య సాగే స్నేహ బంధం, సెంటిమెంట్ సీన్లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయనేది ఫిల్మ్ నగర్ టాక్. కమర్షియల్ హంగులే కాకుండా ప్రేక్షకులను కట్టిపడేసే బలమైన ఎమోషన్స్‌తో కథను దర్శకుడు అద్భుతంగా మలిచారని చెబుతున్నారు.
ఈ మూవీకి కింగ్ 100 అనే పవర్‌ఫుల్ టైటిల్ ఖరారైంది. దర్శకుడిగా రా కార్తీక్ ఈ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. తాజాగా విడుదలైన ఈ టైటిల్ గ్లింప్సెస్ కథా నేపథ్యాన్ని కూడా ఆడియన్స్‌కు పరిచయం చేసింది. ఓ భారీ కుంభకోణం చుట్టూ కథ తిరగబోతున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చారు. రూ. 50,000 కోట్ల భారీ స్కామ్‌కు సంబంధించిన పేపర్ క్లిప్ లో నాగార్జున ఫొటో కనిపించడం ఈ కథపై క్యూరియాసిటీని పెంచింది.
ఇందులో నాగార్జున లుక్, సుపీరియర్ బాడీ లాంగ్వేజ్ స్టైలిష్‌గా కనిపించాయి. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గ్లింప్స్‌లో వచ్చే ప్రతి విజువల్‌ను ఆయన తన మార్క్ సంగీతంతో మరింతగా ఎలివేట్ చేశారు. నాగార్జున రాయల్ అప్పీరెన్స్‌కు తోడు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్ లో ప్రేక్షకులతో విజిల్స్ వేయించడం ఖాయమనిపిస్తోంది. చిత్ర నిర్మాణ విలువలు సైతం రిచ్‌గా, గ్రాండ్‌గా ఉన్నాయి.
Make way for the KING 👑
— Annapurna Studios (@AnnapurnaStdios) August 29, 2026
He is here to REIGN with all his STYLE, SWAG & CHARISMA 🔥🔥#KING100 Birthday Glimpse OUT NOW 🤩🤩
▶️https://t.co/VtGabd40xA#LongLiveTheKing #HBDKingNagarjuna
King @iamnagarjuna @Rakarthik_dir @ThisIsDSP @rajamahadhevan @NavinNooli @ArtSathees… pic.twitter.com/Kwvmn4SQfj
క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నాగార్జున కెరీర్‌లో డిసెంబర్ కు ఓ ప్రత్యేకత ఉంది. గతంలో ఆయన నటించిన బ్లాక్‌బస్టర్ హిట్స్ మన్మథుడు, 'మాస్' సినిమాలు డిసెంబర్ నెలలోనే థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఆ రెండు హిట్ సినిమాలకు కూడా దేవి శ్రీ ప్రసాదే సంగీత దర్శకుడు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు నాగ్.














Click it and Unblock the Notifications