ఆ హీరోతో రొమాన్స్ చేయాలని ఉంది.. తెలుగు హీరో భార్య ఓపెన్ కామెంట్స్

ఎంత హీరో, హీరోయిన్లు అయినా , వారికి కూడా తమ అభిమాన నటులు అంటూ కొందరు ఉంటారు. వారితో కలిసి నటించే అవకాశం వస్తే అసలు వదిలిపెట్టరు. తాజాగా ఇలాగే తన అభిమాన నటుడితో నటించాలనే మనస్సులోని కోరికను బయటపెట్టింది స్టార్ హీరోయిన్ ఆలియా భట్.

దర్శకుడు మహేష్ భట్‌ కూతురుగా ఎంట్రీ ఇచ్చిన ఆలియా భట్‌ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇంటర్మీడియట్ కూడా పూర్తి కాకుండానే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఆలియాకు వరుస అవకాశాలు వచ్చాయి. దీంతో ఆలియా వెనుతిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది.

Alia Bhatt wants to act with Fahadh Faasil

వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేయడం, అవి హిట్ కావడంతో ఆలియా భట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఆలియా తెలుగు సినిమాలో కూడా నటించింది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించింది ఆలియా. ఇదే సమయంలో కపూర్ ఫ్యామిలీకి చెందిన హీరో రణబీర్ కపూర్‌‌తో ప్రేమాయణం సాగించింది. అప్పటికే రణబీర్ కపూర్‌‌ దీపిక పదుకొనె, కత్రినా కైఫ్ వంటి హీరోయిన్స్‌తో ఎఫైర్ సాగించాడు.

వారితో బ్రేకప్ తర్వాత ఆలియాతో రణబీర్ ప్రేమలో పడ్డాడు. 2022 ఏప్రిల్ 14న ఆలియా భట్..రణబీర్ కపూర్‌ను వివాహం చేసుకుంది. రణబీర్, ఆలియా దంపతులకు ఒక కూతురు ఉంది.ఇక ఈ సంవత్సరం ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆలియా భట్‌ సందడి చేసింది. మరోసారి తనదైన అందంతో అభిమానులను అలరించింది. తల్లిగా మారిన తర్వాత కూడా సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నానని ఆలియా ఈ సందర్భంగా వెల్లడించింది.

ఆమె మాట్లాడుతూ.. ఈ సమయంలో పలు ప్రశ్నలకు ఆలియా భట్ సమాధానమిచ్చింది. ఈ సందర్భంగా అలియా తన ఫేవరెట్ హీరో ఎవరో బయటపెట్టింది. పుష్ప 2 విలన్ ఫహద్ ఫాజిల్ తనకు ఫేవరెట్ అని, అతని సినిమాలు బాగా చూస్తాను.. ఫహద్ ఫాజిల్ మోస్ట్ టాలెంట్ పర్సన్ , అతనితో కలిసి నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా అని.. ఏదో ఒక రోజు ఆ ఛాన్స్ వస్తుందని అనుకుంటున్నా అంటూ తన మనస్సులోని కోరికను బయటపెట్టింది ఆలియా. ప్రస్తుతం ఆలియా భట్ ఫహద్ ఫాజిల్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+