కాబోయే భార్యను రివీల్ చేసిన అల్లు హీరో.. ఆమె బ్యాగ్రౌండ్ ఇదే !
తెలుగు చిత్రపరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది అల్లు ఫ్యామిలీ. అల్లు రామలింగయ్య వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన అల్లు అరవింద్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు. ఆయన ముగ్గురు కుమారుల్లో పెద్ద కుమారుడైన బాబీ సినీ రంగంలో యాక్టివ్‌గా లేరు. అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతుండగా.. అల్లు శిరీష్ కూడా తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నారు.
అల్లు శిరీష్ కెరీర్..
'గౌరవం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో.. ఇప్పటి వరకు గ్రాండ్ సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయారు. మొదటి సినిమా ఆశించిన స్థాయిలో అలరించకపోయినా.. కొత్త జంట, ఏబీసీడీ, శ్రీరస్తు శుభమస్తు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిగా 'టెడ్డీ' చిత్రంతో వచ్చిన శిరీష్ మరోసారి ప్రేక్షకులను నిరాశపరిచాడు.

కొన్ని రోజుల క్రితమే శిరీష్ తన నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్ వద్ద నైనిక చేతిని పట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. నైనికతో నిశ్చితార్థం జరుపుకున్నాను" అని ఎంతో ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు. కాగా పారిస్‌లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగినట్లు సమాచారం. కాగా నాటి నుంచి తనకు కాబోయే భార్య విషయంలో గోప్యత పాటిస్తున్న శిరీష్ దీపావళి సందర్భంగా సర్ ప్రైజ్ ఇచ్చారు. నైనికను తొలిసారి అభిమానులకు పరిచయం చేశారు.
కాగా దీపావళి వేడుకల్లో భాగంగా అల్లు కుటుంబం అంతా సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా తీసిన ఫ్యామిలీ ఫొటోలో అల్లు శిరీష్, నైనిక జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ పిక్ బయటకు రావడంతో అల్లు అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ కొత్త జంటను చూసి 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటివరకు సస్పెన్స్‌లో ఉన్న శిరీష్ కాబోయే భార్యను చూడటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
అమ్మాయి ఎవరంటే..?
నైనికా హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమార్తె అని సమాచారం. అల్లు ఇంటికి కాబోయే కోడలికు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
-
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..! -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే












Click it and Unblock the Notifications