9 సినిమాలు చేస్తే.. అందులో 8 అట్టర్ ఫ్లాప్‌లే..!
సినీ ఇండస్ట్రీలో అదృష్టం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. టాలెంట్ ఎంత ఉన్న అదృష్టం కూడా కాసింత కలిసి రావాలి. అదృష్టం ఉంటేనే ఇండస్ట్రీలో రాణించగలుగుతారు. అది హీరో అయినా హీరోయిన్ అయినా ఈ రూల్ వర్తిస్తుంది. ఒక్కసారి ఐరెన్ లెగ్ ముద్ర పడిందంటే చాలు..కోలుకోవడం చాలా కష్టం. సరిగ్గా ఇలాంటి ఇలాంటి సమస్యనే ఓ హీరోయిన్ ఎదుర్కొంటుంది.
ఆ హీరోయిన్ ఏ సినిమాలో నటించినా ఆ సినిమా ఫ్లాప్ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు నిధి అగర్వాల్. నిధి అగర్వాల్. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన నిధి అగర్వాల్, ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తార నిధి అగర్వాల్. బాలీవుడ్‌లో 'మున్నా మైఖేల్' సినిమాతో అరంగేట్రం చేసింది. బాలీవుడ్‌లో అడుగుపెట్టి, తెలుగు, తమిళ చిత్రాలలో తనదైన ముద్ర వేసి, యువతరాన్ని ఆకట్టుకుంటుంది.

తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. 'సవ్యసాచి'తో తెలుగు తెరకు పరిచయమై, 'మిస్టర్ మజ్ను', 'ఇస్మార్ట్ శంకర్' వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే అమ్మడు కెరీర్‌లో ఇప్పటి వరకు సరైన హిట్ మాత్రం లేదు. స్టార్ హీరోలతో నటించినప్పటికీ ఆమె జాతకం మాత్ర మారలేదు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమా నిధి కెరీర్‌కు పెద్ద బూస్ట్ ఇచ్చింది.
అందులో ఆమె పాత్ర, గ్లామరస్ లుక్ యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయినప్పటికీ ఆమెకు అనుకున్నంత స్థాయిలో ఆఫర్లు మాత్రం దక్కలేదు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సైతం నిధి అగర్వాల్‌కు సక్సెస్ అందించలేకపోయారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'హరిహర వీరమల్లు' బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయింది. దీంతో నిధి కెరీర్ అయోమయంలో పడింది.
ప్రస్తుతం అమ్మడు ఆశలన్నీ కూడా 'రాజాసాబ్' సినిమాపైనే ఉన్నాయి. మారుతి, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాతోనైనా నిధి హిట్ కొడుతుందేమో చూడాలి.












Click it and Unblock the Notifications