సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప2 చిత్రం విడుదలవడానికి ముందు రోజు నాలుగోతేదీన రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో బెనిఫిట్ షో వేయగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మృతిచెందింది. ఈ ఘటనలో చిక్కడపల్లి పోలీసులు భారత న్యాయ సంహిత కింద కేసులు నమోదు చేశారు. కేసు నమోదైనవారిలో అల్లు అర్జున్ కూడా ఉన్నారు. ఆయన్ను ఈరోజు మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేసి తమ వాహనంలోనే చిక్కడపల్లి స్టేషన్ కు తరలించారు.













Click it and Unblock the Notifications