అయ్యో "అల్లు అర్జున్".. రామ్ చరణ్ మూవీ కలెక్షన్స్‌లో 10 శాతం కూడా రాలేదా !!
ఐకాన్ స్టార్ "అల్లు అర్జున్".. 'పుష్ప' సిరీస్‌తో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించారు. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రెండు పార్టులుగా వచ్చిన ఈ మూవీ.. పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ అందుకుంది. ముఖ్యంగా 'పుష్ప 2: ది రూల్' అయితే బాక్సాఫీస్‌ను ఊపేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. భారత సినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో తెలుగు చిత్రంగా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఘనవిజయంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ స్థాయి నుంచి పాన్ వరల్డ్ స్టార్ దిశగా ఎదిగారు.
కాగా బాహుబలి పుణ్యమా అని తెలుగు సినిమాలకు గ్లోబల్ స్థాయిలో మంచి క్రేజ్ నెలకొంది. మరి ముఖ్యంగా జపాన్ లో మన చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ 'ముత్తు' సినిమాతో జపాన్ లో కూడా భారీ హిట్ అందుకున్నారు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' మూవీ సైతం మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత ఎన్టీఆర్ 'దేవర', నాగార్జున మనం, ప్రభాస్ సలార్ చిత్రాలు కూడా విడుదలై అలరించాయి. ఈ క్రమంలోనే జనవరి 16న జపాన్ లో 'పుష్ప కున్రిన్' పేరుతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

పుష్ప2 సినిమాకు షాక్..
అయితే జపాన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. స్థానిక ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టలేకపోయింది. భారీ ప్రచారం, విడుదలకు ముందు అల్లు అర్జున్ టోక్యోలో ఉన్నప్పటికీ, మొదటి రోజు పెద్దగా జనం రాలేదు. ఇది పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యపరిచింది. సాక్నిల్క్ అందించిన గణాంకాల ప్రకారం.. పుష్ప 2, జపాన్‌లో మొదటి రోజు కేవలం 886 అడ్మిషన్లు మాత్రమే పొందింది. RRR - 8,230, సాహో - 6,510, కల్కి - 3,700 వంటి సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువగా తెలుస్తోంది. ఆ లెక్కన చూస్తే రామ్ చరణ్ మూవీ కలెక్షన్స్ లో 10 శాతం మాత్రమే వచ్చినట్టు అంచనా వేస్తున్నారు.
RRR విజయం తర్వాత భారత సినిమాలపై ఆసక్తి పెరిగినా, ఈ సినిమాకు పేలవమైన ఆరంభం దక్కింది. పుష్ప 2లో హై-ఎనర్జీ అల్లు అర్జున్ స్టార్ పవర్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నా.. టికెట్ అమ్మకాలకు అవి ఉపయోగపడలేదని భావిస్తున్నారు. మరి రాబోయే వారాల్లో జపాన్‌లో ఈ సినిమా ప్రయాణం ఆసక్తికరంగా ఉంటుందా లేదా అనేది చూడాలి. భారత బాక్సాఫీస్‌ను షేక్ చేసి అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ మూవీ జపాన్‌లోనూ సంచలనం సృష్టించడం ఖాయమని అనుకున్న నేపధ్యంలో ఈ కలెక్షన్స్ అందరికీ షాక్ ఇస్తున్నాయి.
-
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !!












Click it and Unblock the Notifications