త్రివిక్రమ్ శ్రీనివాస్ కు హ్యాండిచ్చిన అల్లు అర్జున్?

ఐకాన్ స్టార్ గా ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. పుష్ప2 తో గ్లోబల్ హీరో అయ్యేందుకు అడుగులు వేస్తున్నారు. అందుకనుగుణంగానే ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తీర్చిదిద్దుతున్నారు. ఆసియాలోని పలు దేశాల్లో దీన్ని విడుదల చేయబోతున్నారు. అన్ని దేశాల్లో పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ మేనరిజం అందరికీ నచ్చిందని, పుష్ప2తో మరోసారి ఆకట్టుకుంటాడని అంటున్నారు. ఇంత ఇమేజ్ వచ్చిన తర్వాత తర్వాత సినిమా ఏది చేయాలా? అనే డైలమాలో బన్నీ ఉండిపోయాడు

వాస్తవానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో బన్నీకి మంచి సాన్నిహిత్యం ఉంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం సినిమాలతో మూడు సూపర్ హిట్లను త్రివిక్రమ్ అల్లు అర్జున్ కు అందించాడు. పుష్ప2 తర్వాత త్రివిక్రమ్ తోనే సినిమా చేసేందుకు బన్నీ అన్నీ సిద్ధం చేసుకున్నాడు. అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. అయితే రోజురోజుకు అల్లు అర్జున్ ఇమేజ్ పెరుగుతుండటం, పుష్ప2 మీద భారీ అంచనాలుండటంతో మరోసారి బన్నీ ఏ దర్శకుడితో ఎటువంటి కథతో సినిమా చేయాలా అనే డైలమాలో పడ్డాడు.

allu arjun rejected trivikram srinivas movie

జవాన్ తో సూపర్ హిట్ ఇచ్చిన అట్లీ బన్నీ కోసం ఎదురుచూస్తున్నాడు. కథ కూడా నచ్చిందని వార్తలు వస్తున్నాయి. గుంటూరు కారం సినిమాతో ఊహించనిరీతిలో డిజాస్టర్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాకంటే బన్నీతో సినిమా చేయడమే సరైందనే నిర్ణయానికి అల్లు అర్జున్ వచ్చాడంటున్నారు. దీనికి సంబంధించి త్రివిక్రమ్ తో కూడా మాట్లాడాడంటున్నారు. గుంటూరుకారం సినిమా ఫ్లాపవడం కూడా త్రివిక్రమ్ ఇమేజ్ పై దెబ్బపడింది.

తర్వాత ఏ సినిమా చేయాలా? ఏ హీరోతో చేయాలా? ఏ కథను ఎంచుకోవాలా? అనే డైలమాలో మాటల మాంత్రికుడున్నాడు. బన్నీ వెనకడుగు వేస్తే త్రివిక్రమ్ కు మైనస్ అవుతుందంటున్నారు. అట్లీ, బోయపాటి శ్రీను, సందీప్ రెడ్డి వంగాలు బన్నీతో సినిమా చేసేందుకు కథలు సిద్ధం చేసుకొని ఎదురుచూస్తున్నారు. దాదాపుగా పుష్ప2 తర్వాత అట్లీ దర్శకత్వంలోనే బన్నీ సినిమా ఉంటుందంటున్నారు.

అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన ఇది విడుదల కాబోతోంది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. పుష్ప2 తో కూడా ఆగేది లేదని, దీన్ని ఒక ఫ్రాంఛైజీగా తీసుకురాబోతున్నట్లు అల్లు అర్జున్ బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రకటించాడు. ఆ ఫెస్టివల్ లో పాల్గొనడానికి భారతదేశం నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక నటుడిగా నిలిచి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

పుష్ప సినిమా తెలుగులోకన్నా బాలీవుడ్ లోనే ఘనవిజయాన్ని సాధించింది. హిందీ ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టడం కోసం దర్శకుడు సుకుమార్ ప్రతి సన్నివేశాన్ని జాగ్రత్తగా చెక్కుకుంటూ వస్తున్నాడు. పుష్ప2తో మరో సూపర్ హిట్ ఖాయం అనే అంచనాలో బన్నీ అభిమానులు ఉన్నారు. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా అతను అభిమానులు సంపాదించుకున్నాడు. ఎంతోమంది బన్నీని ఇష్టపడుతున్నారు. అటువంటి బన్నీకి కూడా ఇష్టమైన నటుడు ఒకరు ఉన్నారు. ఆయన ఎవరో కాదు.. బి్ బి అమితాబ్ బచ్చన్.

సూపర్ స్టార్ అమితాబ్ అంటే బన్నీకి ఎంతో ఇష్టం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. మొదటి నుంచి అమితాబ్ సినిమాలు ఎక్కువగా చూసేవాడినని, షోల్, జంజీర్ సినిమాలను చాలాసార్లు చూసినట్లు తెలిపాడు. ఈ విషయం గురించి తెలియడంతో బన్నీ అభిమానులతోపాటు బిగ్ బి అభిమానులు కూడా సంతోషాన్ని ఫీలవుతున్నారు. భవిష్యత్తులో అల్లు అర్జున్ మరిన్ని ఘనవిజయాలు సాధిస్తాడని, ప్రస్తుతం పాన్ ఇండియా హీరో స్థాయి నుంచి గ్లోబల్ హీరో స్థాయికి ఎదుగుతాడని నమ్మకంగా చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+