మూడు ముళ్లు బంధంతో ఒక్కటైన "అల్లు శిరీష్ - నైనికా"..!

అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి నయనికతో శిరీష్ వివాహం ఈ శుక్రవారం (మార్చి 6, 2026) సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని కొల్లూరు ఐనా ఈవెంట్ స్పేస్ వేదికగా జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాలు, అతిథుల సమక్షంలో ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అల్లు అర్జున్‌ వివాహ వార్షికోత్సవమూ కూడా ఈరోజే (మార్చి 6) కావడం విశేషం

కాగా వీరి వివాహ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఈ పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అల్లు శిరీష్ - నైనికా జంటకు సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వధూవరులు, అల్లు అరవింద్, అల్లు అర్జున్‌లతో కలిసి సీఎం ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

allu-sirish-and-nainika-reddy-marriage-done-at-kollur-in-hyderabad-and-photos-goes-viral-on-media

ఇక గత నాలుగైదుళ్లుగా అల్లు శిరీష్, నయనిక ప్రేమించుకుంటున్నారు. ఫ్యామిలీ ఫంక్షన్లలో ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారి, నేడు పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కింది. అయితే మూడు రోజుల క్రితమే వీరి ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది ప్రముఖులు హాజరుకాగా.. నేడు జరిగిన పెళ్లిని మాత్రం అత్యంత ప్రైవేట్‌గా, సన్నిహితుల సమక్షంలో జరిపించడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+