రజనీకాంత్ 'జైలర్ 2' పై అల్లు అర్జున్ షాకింగ్ ట్వీట్ వైరల్
సూపర్ స్టార్ రజనీకాంత్- కోలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన జైలర్ 2 మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ ర్యాంపేజ్ సృష్టిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ చిత్రం కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్లను అందుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా జైలర్ 2 మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మూవీని చూసిన ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ను ఆకాశానికి ఎత్తారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. జైలర్ 2 మూవీలో రజనీకాంత్ స్టార్ పవర్, స్వాగ్, ఆరా గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. ఎడ్రినలిన్ పంపింగ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇదేనని పోస్టు చేశారు.
#Jailer2 is 🔥🔥🔥A true showcase of @rajinikanth sir’s star power, swag & aura! A Commercial Entertainer that keeps the adrenaline pumping! Brother... @anirudhofficial KILLED IT! All the artists, technicians & the producer have poured their hearts into this film. The Showman @Nelsondilpkumar garu delivers the coolest hit with a BANG! చొక్కా నలగకుండా 500 CR+ కొట్టడం ఒక్క రజినీ గారికే సాధ్యం! 🖤Congratulations to the entire team! @sunpictures
— Allu Arjun (@alluarjun) October 22, 2026
అలాగే బ్రదర్ అనిరుధ్.. యూ కిల్డ్ ఇట్..!! ఆర్టిస్టులు.. టెక్నీషియన్లు, నిర్మాత.. ఇలా అందరూ తమ ప్రాణం పెట్టి సినిమాకు పనిచేశారు. ది షో మాన్ నెల్సన్ దిలీప్ కుమార్ కూలెస్ట్ హిట్ ను బ్యాంగ్ తో డెలివర్ చేశారు. చొక్కా నలగకుండా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడం ఒక్క రజనీ గారికే సాధ్యం.. జైలర్ 2 చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అని చివరగా సన్ పిక్చర్స్ ను ట్యాగ్ చేశారు.. అయితే అల్లు అర్జున్ ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఇక అల్లు అర్జున్ ట్వీట్ కు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రిప్లై ఇచ్చారు. మై బ్రదర్ అంటూ లవ్ సింబల్ ఈమోజీలతో తన ట్వీట్ పెట్టారు.

ఇక 2023 లో రజనీకాంత్- నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన జైలర్ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 500 కోట్లకుపైగా కలెక్షన్స్ ను రాబట్టింది. అయితే ఈ మూవీకి కొనసాగింపుగా ఇటీవల జైలర్ 2 విడుదలైంది. ఈ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు కన్నడ స్టార్ హీరో శివకుమార్, సూరజ్ వెంజారమూడు, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ నటి విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి, ఎస్ జే సూర్య తదితరులు నటించారు.












Click it and Unblock the Notifications
