మహీ vs మహీ: మ్యూచువల్స్ డ్రీమ్ పిక్
Super Star Mahesh Babu: సోషల్ మీడియాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హవా కంటిన్యూ అవుతోంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్.. ఇలా ఏ ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినా.. మహీ భాయ్ ఫొటోలు, వీడియోలు వెల్లువెత్తుతున్నాయి. సునామీలా విరుచుకుపడుతున్నాయి.
దేశీయ పారిశ్రామికదిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ- నీతా అంబానీ తనయుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వెడ్డింగ్‌కు గెస్ట్‌గా హాజరైన సమయంలో కనిపించిన మహేష్ బాబు లుక్.. సోషల్ మీడియాను తగులబెట్టింది. ఓ రేంజ్‌లో ఆయన ఫొటోలు, వీడియోలు షేర్ అవుతోన్నాయి. భార్య నమ్రత, కూతురు సితారతో కలిసి దిగిన ఫొటోలు ఫ్యాన్స్‌ను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాయి.

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, కండలవీరుడు సల్మాన్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్.. ఇలా స్టార్ క్యాస్ట్ మొత్తం ఇదే ఈవెంట్‌లో మూకుమ్మడిగా మెరిసినప్పటికీ- వారందరిని మరిపించింది మహేష్ బాబు లుక్.
24 గంటలుగా మహేష్ బాబు పేరు హ్యాష్ ట్రెండ్ కొనసాగుతోందంటే- ఆయన ఫ్యానిజం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. జియో వరల్డ్ సెంటర్‌లో ఆయన కనిపించిన మరుక్షణం నుంచి ఇప్పటివరకూ లక్షల సంఖ్యలో ఫొటోలు, వీడియోలు షేర్ అయ్యాయి. #MaheshBabu అనే హ్యాష్ ట్యాగ్ కింద అదే స్థాయిలో ట్వీట్లు, రీట్వీట్లు పోస్ట్ అయ్యాయి.
దీనికి మరింత పెట్రోల్ పోసినట్టయింది.. మహేష్ బాబు తాజా ఫొటో. టీమిండియా, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కేప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో కలిసి దిగిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసి పారేస్తోంది. మహీ- మహీ మ్యూచువల్ ఫ్యాన్స్ ఈ ఫొటోతో పండగ చేసుకుంటోన్నారు. ట్వీట్లు, రీట్వీట్లు కొడుతున్నారు.












Click it and Unblock the Notifications