అనసూయ అతనితో లేచిపోవడానికి సిద్ధమైందా..?
యాంకర్ అనసూయ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న వారి పేర్లలో అనసూయ కూడా ఒకరు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనుసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేంతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
రంగస్థలం సినిమా తరువాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బుల్లితెరకు గుడ్ బై చెప్పిన అనసూయ కేవలం వెండితెరకు మాత్రమే పరిమితం అయింది. ఇక సోషల్ మీడియాలో అనసూయకుచెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం.

అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హ్యాట్ బ్యూటీ 38 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది. ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. చీర కట్టిన, స్కార్ట్ వేసిన అది అనసూయకే చెల్లింది. అనసూయ తన అందం,నటనతో చాలామంది అభిమానులను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే అనసూయ పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అనసూయది ప్రేమ వివాహం అనే సంగతి అందరికి తెలిసిందే. అనసూయ ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే రోజుల్లో ఎన్‌సీసీ క్యాంపుకి వెళ్లిందట. అక్కడ సుశాంక్ భరద్వాజ్ పరిచయం అయ్యాడు. టీనేజ్ లో ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. అది ఏళ్ల తరబడి సాగింది. నన్ను పెళ్లి చేసుకుంటావా? అని సుశాంక్... అనసూయను అడిగాడట. వెంటనే వర్షం వచ్చిందట. అనసూయ-సుశాంత్ పీకల్లోతు ప్రేమలో ఉండగా... పెళ్లి సంబంధం వచ్చిందట. అనసూయ తండ్రి ఆమె కోసం ఒక పైలెట్ ని తెచ్చాడట. మంచి ఉద్యోగం, ఆస్తిపరుడు చేసుకుంటే సుఖపడతావని చెప్పాడట.
సంబంధం ఓకే అయ్యే సమయంలో... అనసూయ తన ప్రేమ విషయాన్ని తల్లి ద్వారా చెప్పించిందట. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అనసూయ తండ్రి వెంటనే సూట్ కేస్ బయటకు విసిరి, అనసూయను గెంటేశాడట. ఏళ్ళు గడుస్తున్నా అనసూయ తండ్రి మనసు మారలేదట. దాంతో అనసూయ మనం లేచిపోయి పెళ్లి చేసుకుందామనే ప్రపోజల్ భరద్వాజ్ ముందుంచితే అందుకు అతను ఒప్పుకోలేదట. పెద్దలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంటే గౌరవం ఉండదు. మనం వేచి చూద్దాం. ఆయన మనసు మారవచ్చని పలుమార్లు సర్ది చెప్పాడట. ఎంతకీ అనసూయ మాట వినకపోవడంతో చేసేది లేక తండ్రి సుశాంక్‌తో పెళ్లికి ఓకే చేశాడట.












Click it and Unblock the Notifications