మార్కెట్‌లోకి అనసూయ కొత్త వీడియో.. చూస్తే మెంటల్ ఎక్కాల్సిందే..!

యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనసూయ ఏం చేసిన కూడా సంచలనమే అన్నట్టుగా ఉంటుంది. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ తరువాత యాంకర్‌గా , హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది. ముఖ్యంగా జబర్థస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ..తద్వారా పలు సినిమాల్లో కూడా ఛాన్స్‌లు కొట్టేసింది.

క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ నటనకు మంచి గుర్తింపు దక్కింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.

Anchor anasuya instagram video goes viral

ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే..అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందం , అభినయం రెండు ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేం కాదు. బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బికినీలతో రచ్చ చేస్తూ..ట్రోలింగ్ బారిన పడుతున్నారామె. ఇక హీరో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అందరికి తెలిసిందే. తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా సమాధానం కౌంటరిస్తుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ. ఈ హ్యాట్ బ్యూటీ 39 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది.

Take a Poll

ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఏమాత్రం చెక్కు చెదరని అందం ఆమె సొంతం. ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. చీర కట్టిన , స్కార్ట్ వేసిన ఏం చేసిన అది అనసూయకే చెల్లింది. తాజాగా అనసూయ తన సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసింది. బ్లూ కలర్ శారీతో తళుక్కున మెరిసింది. చీరలో అనసూయ మరింత అందంగా కనిపించడంతో కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు.

అనసూయ తనదైనశైలిలో అందాలు ఆరబోసింది. అనసూయ అందానికి ఎన్ని మార్కులు ఇచ్చిన తప్పు లేదంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కొందరు అనసూయకు పండుగ విషెష్ చెబుతుండగా.. మరి కొందరు పండగ పూట కూడా మమ్మల్ని నిద్ర పోనివ్వవా అంటూ అనసూయ అందాల గురించి కామెంట్ చేస్తున్నారు.ప్రస్తుతం అనసూయ అందాల వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+