బేవర్స్ గాళ్లు ..ఆ పని కోసం డబ్బులిస్తామంటూ
యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'పోవే పోరా' షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ, ఆ తర్వాత అనుకున్న స్థాయిలో కెరీర్‌లో రాణించలేకపోయింది. అడపాదడపా ఈవెంట్లలో తప్ప, ఆమెకు సినిమాల్లో కానీ, పెద్ద షోలలో కానీ పెద్దగా అవకాశాలు దక్కడం లేదనే చెప్పాలి.
గతంలో 'జర్రీ జర్రీ' అనే ప్రైవేట్ సాంగ్‌తో యూట్యూబ్‌లో సంచలనం సృష్టించినా, అది కూడా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారలేదు. బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఆమె విన్నర్ అవుతుందని అభిమానులు ఆశించారు. కానీ హౌస్‌లో తన ఆటతీరు కంటే పృథ్వీతో ఉన్న సన్నిహితానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఎఫైర్ కోసమే సమయం కేటాయించడం వంటి విమర్శలు రావడంతో ఆమె షో మధ్యలోనే ఎలిమినేట్ అయి అభిమానులను నిరాశపరిచింది.

కెరీర్‌లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న విష్ణుప్రియ, తన టాలెంట్‌ను, అందాన్ని బయటపెట్టడానికి సోషల్ మీడియాను ఒక శక్తివంతమైన సాధనంగా వాడుకుంటోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్‌డేట్‌లను పంచుకునే ఈ యాంకర్ ఫొటోషూట్లతో నెట్టింట్లో సెగలు రేపుతుంటుంది.
తాజాగా విష్ణుప్రియ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్న వచ్చే వారికి టాలెంట్ ఉంటే సరిపోదని, లక్ కూడా ఉండాలని లేకపోతే ఇక్కడ రాణించలేమని చెప్పుకొచ్చింది. మీ జాతకంలో స్టార్ అని రాసి ఉంటనే ఇక్కడ రాణించగలుగుతారని విష్ణుప్రియ తెలిపింది.
ఇక ఇదే సమయంలో కాస్టింగ్ కౌచ్ గురించి కూడా విష్ణుప్రియ తనదైనశైలిలో రియాక్ట్ అయింది. ఇక్కడ ఆఫర్స్ రావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలని, లేకపోతే అవకాశాలు ఇవ్వరని కొందరు హెచ్చరించారు. ఆ మాట విన్న తర్వాత ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయానని, కానీ మల్లెమాల ఎంటర్‌టైనర్స్ నుంచి పిలుపు రావడంతో తిరిగి ఇండస్ట్రీలో అడుగుపెట్టానని ఆమె తెలిపింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యే కొంతమంది బేవర్స్ గాళ్లు మమ్మల్ని చూసి డబ్బుకోసం ఏదైనా చేస్తారు అనుకుంటారు. కానీ నేను ఏ రోజు అలాంటి విషయాలను పట్టించుకోలేదు. నా గురించి ఎవరేమనుకున్నా నా పని నేను చేసుకుంటూ పోతానని కుండబద్దలు కొట్టేసింది. ప్రస్తుతం విష్ణుప్రియ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
-
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications