నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసిన స్టార్ డైరెక్టర్.. వెంకీ - కళ్యాణ్ రామ్ కాంబోలో !!
తెలుగు చిత్ర పరిశ్రమలోని సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ఒకరిగా పేరొందారు అనిల్ రావిపూడి. పటాస్ సినిమాతో అనిల్ రావిపూడి దర్శకుడిగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. అయితే అంతకు ముందు ఎన్నో చిత్రాలకు రైటర్‌గా పని చేశాడు. ఇక ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఘోస్ట్ రైటర్‌గానూ పని చేశాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాలు ఇప్పటివరకు ఘనవిజయాలు సాధించాయి. వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తూ కమర్షియల్ సక్సెస్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. 2025 లో వెంకటేష్ హీరోగా 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో భారీ హిట్ అందుకున్నారు. ఆ మూవీ భారీ కలెక్షన్స్ కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చింది.
ఇక ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మనశంకర వరప్రసాద్ గారు' సంక్రాంతి బరిలో నిలిచి, బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా కాసుల వర్షం కురిపించింది. ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ఈ స్టార్ డైరెక్టర్ తన నెక్ట్స్ సినిమా పనులను షురూ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ చేస్తూ తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు.

ఈ సందర్భంగా అనిల్ రావిపూడి తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో నెక్ట్స్ ప్రాజెక్ట్ వివరాలను ప్రకటించారు. ఈ మేరకు ఆ పోస్టులో.. మొదటి "వందకోట్ల బొమ్మ" కొట్టిన హీరో.. విక్టరీ వెంకటేష్ తో, "మొదటిసారి బొమ్మ" తీసే అవకాశం ఇచ్చిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తో 2027 మొదటి పండగకి మీ, ముందుకు వస్తున్నాం అని రాసుకొచ్చారు. దీంతో నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు వెంకటేష్, కళ్యాణ్ రామ్‌ల కాంబోలో మూవీ అని ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతి బరిలో నిలిపేలా ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.
ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం.. మూడు చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. అలానే ఈ ఏడాది రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రంలో కూడా వెంకీ కీ రోల్ ప్లే చేశాడు. దాంతో వీరి కాంబోలో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మొదటి "వందకోట్ల బొమ్మ" కొట్టిన హీరో.. Victory @VenkyMama గారితో🔥
— Anil Ravipudi (@AnilRavipudi) February 26, 2026
"మొదటిసారి బొమ్మ" తీసే అవకాశం ఇచ్చిన హీరో @NANDAMURIKALYAN గారితో కలిసి 💥
2027 మొదటి పండగకి మీ, ముందుకు వస్తున్నాం 😍😍😍#VenkyAnil5 #NKRxAR pic.twitter.com/WRVWdbQpbz












Click it and Unblock the Notifications