విడాకులు తీసుకున్న మరో స్టార్ సెలబ్రిటీ జంట
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. తమ లైఫ్ పార్టనర్‌తో రాజీ పడకపోవడం అత్తింటి గొడవలు ,పెళ్లి తరువాత కూడా కెరీర్ కొనసాగించడం, పర్సనల్ లైఫ్‌ను మెయిన్‌టైయిన్ చేయడం మొదలగు కారణాలతో సెలబ్రిటీలు విడాకులు బాట పడుతున్నారు.
తాజాగా ఓ స్టార్ సెలబ్రిటీ జంట విడాకులు తీసుకోవడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ జంట మరెవ్వరో కాదు ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ తన భార్యకు విడాకులు ఇచ్చారు. జీవీ ప్రకాష్ తన భార్య సైంధవికి విడాకులు ఇచ్చినట్టు అధికారికంగా ప్రకటించారు. సైంధవి ప్రముఖ సింగర్ అనే విషయం అందరికి తెలిసిందే. 11 ఏళ్ల క్రితం జీవీ ప్రకాష్ సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.

విడాకులపై జీవీ ప్రకాష్ స్పందిస్తూ..ఎంతో ఆలోచించి చివరికి విడిపోవాలి అని డిసైడ్ అయ్యాం. నేను సైంధవి నిర్ణయించుకున్న డెసిషన్ మీకు చెబుతున్నాము.. మేము పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాము. దయచేసి మాకు ప్రైవసీ ఇవ్వండి. మీడియా స్నేహితులు .. అభిమానులు మా నిర్ణయాన్ని గౌరవించండి .. ఈ నిర్ణయం మా ఇద్దరికీ మంచిదే..అందుకే మేము ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం అంటూ జీవి ప్రకాష్ ఇంస్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం జీవీ ప్రకాష్ విడాకుల వార్త తమిళ ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది.












Click it and Unblock the Notifications